27.7 C
Hyderabad
April 18, 2024 08: 56 AM
Slider గుంటూరు

ఓట్ల లెక్కింపునకు గుంటూరు రూరల్ పోలీస్ ఏర్పాట్లు పూర్తి

#gunturpolice

ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు దృష్ట్యా రూరల్ జిల్లా పరిధిలో మూడంచెల బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.  ఓట్ల లెక్కింపు ప్రక్రియ దృష్ట్యా రూరల్ జిల్లా పరిధిలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నేడు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయములో పలు విభాగాల పోలీస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

రూరల్ జిల్లా పరిధిలో 40 మండలాల్లోని 481 ఎంపీటీసీ,39 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, ఆయా స్థానాల ఓట్ల లెక్కింపునకు సంబంధించి 37 కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేశారు. ముందస్తుగా స్ట్రాంగ్ రూములు మరియు కౌంటింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశాలను గుర్తించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరగడానికి తగినంత మంది సిబ్బందిని నియమించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద గస్తీ నిర్వహణకు పెట్రోలింగ్ పార్టీ లు, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసే స్టాటిక్ పార్టీ(static party), అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు సత్వరనే స్పందించడానికి స్ట్రైకింగ్ పార్టీలు(striking party) ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే వారికి తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఉండే విధముగా చూస్తూ, పోలింగ్ కేంద్రాల లోపలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న ఆయా పార్టీల ఏజంట్లకు NOC పత్రాలు ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో మంజూరు చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.

ఈ సమావేశంలో రూరల్ జిల్లా అదనపు ఎస్పీలు రిశాంత్ రెడ్డి(అడ్మిన్), బిందుమాధవ్ (SEB జాయింట్ డైరెక్టర్),NVS మూర్తి (క్రైమ్స్),SVD ప్రసాద్ (ఏఆర్),జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని సబ్ డివిజన్ల డీఎస్పీలు,ఏఆర్ డిఎస్పీ చిన్ని కృష్ణా ఆర్ఐలు పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

అమరావతిని సర్వనాశనం చేయడానికి జగన్ కుట్ర

Satyam NEWS

అమృత మూర్తులార….

Satyam NEWS

తిరుపతి ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల అండ

Satyam NEWS

Leave a Comment