32.2 C
Hyderabad
March 28, 2024 21: 25 PM
Slider విజయనగరం

పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం…కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు

#policeprotection

విజయనగరం జిల్లా లో జేడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఓ వైపు థర్డ్ వేవ్ పొంచిఉందన్న హెచ్చరికలతో రాత్రి పూట కర్ఫ్యూ ను ఈ నెలాఖరు వరకు  పొడిగించింది.. రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో నే జరుగుతున్న కౌంటింగ్ వద్ద దాదాపు 1500 పోలీసులతో జిల్లా ఎస్పీ దీపికా బందోబస్తు నిర్వహిస్తున్నారు.34 మండల కేంద్రాల్లో 31 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. ఎల్విన్ పేటలో ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, గంట్యాడలో ఎస్ఐ కిరణ్, అలాగే విజయనగరం వన్ టౌన్ సీఐ మురళి..ఇలా ఎస్పీ కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా  ఎస్పీ దీపికా ఆదేశాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు కౌంటింగ్ విధులు నిర్వర్తించడానికి వచ్చిన అధికారులకు, సిబ్బందికి కరోనా నిబంధనలు పాటించాలని సూచించి, గుర్తింపు కార్డులను పరిశీలించి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్ల పాటించాల్సిన నిబంధనల గురించి తెలియజేస్తూ, కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో  ప్రజలు, అభ్యర్థులు గుమ్మి కూడి ఉండకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.

Related posts

రుణమాఫీని త్వరగా పూర్తి చేయాలి

Bhavani

జంపన్న వాగు వరద బాధితులకు సీతక్క సాయం

Satyam NEWS

కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

Satyam NEWS

Leave a Comment