నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయిన నేపథ్యంలో కడప జిల్లా నందలూరు కోర్టు లోని భవనాలను రాష్ట్ర హై కోర్టు జడ్జి వెంకట రమణ పరిశీలించారు. రూ.4.80 కోట్లతో నందలూరు కోర్టు అభివృద్ది, క్వార్టర్స్ ల నిర్మాణానికి మరో కోటి ఖర్చు చేయనున్నారని నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహులు తెలిపారు.
అలాగే రాజంపేట కోర్టు ను కూడా పరిశీలించారు. ఇక్కడ కూడా నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాస్, 3 వ అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, రాజంపేట సీనియర్ జడ్జి శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి ఫైజున్నిస్సా వున్నారు.
ఈ సందర్భంగా రాజంపేట, నందలూరు కోర్ట్ లో న్యాయమూర్తి వెంకటరమణని న్యాయ వాదుల సంఘం ప్రెసిడెంట్ నరసింహులు, ఏ జి పి సమీఉల్లా ఖాన్ ,న్యాయవాదులు మల్లి కార్జున, షేక్ సుబ్బరామాయ్య, వినయ్, కృష్ణారెడ్డి లు సన్మానించారు.