కడప జిల్లా సిద్దవటం మండలం సాకారాజుపల్లె ఉప్పారపల్లె గ్రామ పంచాయతీ లోని 425/1 సర్వే నంబర్లో ని మూడు ఎకరాల 50 సెంట్ల భూమిని బాధితునికి మొండి చెయ్యి చూపి రెవెన్యూ అధికారుల మాయా జాలంతో పప్పు బెల్లంలా అమ్మకానికి పెట్టారు.425/1 సర్వే నెంబర్ లో గత 22 సంవత్సరాలుగా పళ్లెం చిన్న సుబ్బారెడ్డి ఆధీనంలో ఉంది. అయితే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ గృహ నిర్మాణాలకు ఈ స్థలం కేటాయించడంతో అసలు వివాదం మొదలైంది.
బాధితుడు పళ్లెం చిన్న సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు బాధితునికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే రెవెన్యూ అధికారులు కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా అక్కడ 53 ఇండ్ల కేటాయింపు చేశారు. ఈ ప్రాంతం గుట్ట ప్రాంతం కావడంతో పెద్ద పెద్ద రాళ్లు బయట పడ్డాయి.
నివాసానికి అనువైన ప్రాంతం కాదని పనులు నిలిపి వేశారు. పక్కనే ఉన్న బాధితునికి చెందిన 424 సర్వే లో పై కూడా కోర్టు తీర్పు ఇచ్చినా అందులో పాత డేట్లు వేసి రెవెన్యూ అధికారులు అమ్ము కుంటున్నారని,సెలవు దినాల్లో హుటాహుటిన రేకుల షేడ్లు వేస్తున్నారని న్యాయ బద్దంగా అన్నీ రికార్డులు ఉన్న తన భూమిని తనకు అప్పగించాలని బాధితుడు మొర పెట్టు కున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే తనపై వీఆర్ఏ,వీఆర్ఓ లు ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు.
కాగా డిప్యూటీ తాసిల్దారు వివరణ ఇస్తూ పళ్లెం చిన్న సుబ్బారెడ్డి తనభూమికి సంభందించిన ఆధారాలు ఉన్నాయని వచ్చాడని,భూమి సర్వే అనంతరం తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.