39.2 C
Hyderabad
March 28, 2024 13: 55 PM
Slider జాతీయం

భారత్ బయోటెక్ కోవాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమతి

#Covaxin

కోవిషీల్డ్ మాదిరిగా కోవాక్సిన్ ను కూడా వాడుకోవచ్చునని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతిచ్చింది. ఇప్పటి వరకూ కోవాక్సిన్ కు కేవలం క్లీనికల్ ట్రయల్స్ అనుమతి మాత్రమే ఉంది.

క్లీనికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయో టెక్ సిద్ధం చేయకపోవడంతో కోవాక్సిన్ కు కేవలం క్లీనికల్ ట్రయల్స్ అనుమతి మాత్రమే ఉంది.

అంటే భారత్ బయోటెక్ కోవాక్సిన్ తీసుకున్న వారిని పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలనే నిబంధన ఉండేది.

అయితే నేడు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు ప్రయోగ ఫలితాల పూర్తి డేటాను భారత్ బయోటెక్ అందించింది.

ఆ ఫలితాలను పూర్తిగా పరిశీలించిన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోవాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది.

పూర్తి స్థాయి అనుమతులు రావడం స్వదేశీ టీకాకు మేలు చేస్తుంది. ఇక నుంచి కోవి షీల్డ్ మాదిరిగానే కోవాక్సిన్ ను కూడా పూర్తి స్థాయి కరోనా టీకాగా ఉపయోగించే అవకాశం వచ్చింది.  

Related posts

నాలుగు నెలలు గా జీతాలు రాక సమగ్రా శిక్షా ఉద్యోగి ఆత్మహత్య…

Satyam NEWS

నిర్మల్ ఫర్టిలైజేషన్ అసోసియేషన్ రూ.లక్ష విరాళం

Satyam NEWS

ఇల్లిసిట్ లిక్కర్: ఎక్సైజ్ అధికారుల పై ఫిర్యాదుల వెల్లువ

Satyam NEWS

Leave a Comment