కోవిడ్ 19 వైరస్ ప్రబల కుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తో కూడిన అవగాహన పోస్టర్ ను పెదకూరపాడు శాసనసభ సభ్యుడు నంబూరి శంకరరావు నేడు ఆవిష్కరించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రోడ్డు సేఫ్టీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరి శంకరరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో కోవిడ్ 19 వైరసు విస్తరించకుండా అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు “నోటు టూ పానిక్ – యస్ టూ ప్రికాషన్స్” అనే నినాదంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని దగ్గు, తుమ్మినప్పుడు మొఖానికి క్లాత్ అడ్డం పెట్టుకోవాలని ఆయన కోరారు.
అదే విధంగా రేపు ఆదివారం ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. విదేశాల నుండి వచ్చిన వారి సమాచారం స్థానిక ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని ప్రజల సమిష్టి సహకారంతో ఈ కరోనా వైరస్ విస్తృతం కాకుండా ప్రజలు సహకరించాలని, వచ్చిన తరువాత బాధపడకుండా ప్రతి ఒక్కరూ ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యన్. జి. ఓ కన్వీనర్ బి. కె. దుర్గ పద్మజ, సభ్యులు సాంబశివరావు, వెంకటేశ్వరరావు, బంగారయ్య, కోటేశ్వరరావు లు పాల్గొన్నారు.