31.7 C
Hyderabad
April 24, 2024 23: 05 PM
Slider కడప

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు కోవిడ్ బ్రేక్

#Ontimittatemple

రెండో భద్రాద్రి అయిన కడప జిల్లా ఒంటిమిట్ట దేవాలయం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శుక్రవారం ఉదయం 10:35 మూసి వేశారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఢిల్లీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేశారు.

దీనితో నేటి ఉదయం 10:35 గంటలకు ఆలయం మూసి వేశారు.

భక్తులకు ఆలయ ప్రవేశం లేకుండా ఈనెల 21 నుంచి 29 వరకు బ్రహ్మోత్సవాలు, ఆలయం లోపల ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంతంగా నిత్య కైంకర్యాలు జరుపనున్నారు.

ఒంటిమిట్ట ఆలయంతో పాటు నందలూరు శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం, పుష్పగిరి ఆలయాలను కూడా మూసివేసారు.

గత ఏడాది కూడా కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో ఒంటిమిట్ట శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు భక్తులకు ప్రవేశం లేకుండా నిర్వహించారు.

తిరిగి ఈ యేడాది కూడా కోవిడ్ మూలంగా ఆలయంలో ఏకాంతంగా జరుపనుండడంతో భక్తులు నిరుత్సాహం చెందుతున్నారు.

Related posts

వాలీబాల్ క్రీడాకారుడికి ములుగు జెడ్పి చైర్మన్ సాయం

Satyam NEWS

9న నరసరావుపేట లో ఇస్కాన్‌ జగన్నాథ రథోత్సవం

Satyam NEWS

ఘనంగా జరిగిన తీజ్ పండుగ వేడుకలు

Satyam NEWS

Leave a Comment