27.7 C
Hyderabad
April 24, 2024 08: 16 AM
Slider గుంటూరు

పిడుగురాళ్ల లో 120 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

#CovidCareCenter

కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కోవిడ్ కేర్ సెంటర్ ను పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు.

కోవిడ్ బాధితులకు 15 నిమిషాలలో బెడ్  దొరకాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి ప్రాంతంలో కోవిడ్ హాస్పిటల్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

అందులో భాగంగా పిడుగురాళ్ల పట్టణంలో 120 పడకలతో ఆసుపత్రి నిర్మించారు. పిడుగురాళ్ల పట్టణం లోని గంగమ్మ గుడి ఎదురుగా ఈ నూతన  కోవిడ్ కేర్ సెంటర్ ఉంది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి,  పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎండి గఫార్, పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ బుర్రి వెంగళ రెడ్డి, డాక్టర్ వున్నం నాగమల్లికార్జున రావు, పట్టణ వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

సంక్షేమ రంగానికి 47వేల కోట్ల రూపాయల వ్యయం

Satyam NEWS

జాతీయ కూటముల్లో కేసీఆర్ స్థానం ఎక్కడో….?

Satyam NEWS

మంచి కంటి చూపు కోసం  20-20-20 నియమం పాటించాలి

Satyam NEWS

Leave a Comment