37.2 C
Hyderabad
April 19, 2024 11: 46 AM
Slider జాతీయం

కరోనా ప్రకోపంతో పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు

#PanjabCM

రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం బహిరంగ సమావేశాలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధించింది.

బహిరంగంగా జరిగే వేడుకలకు 200 మంది కన్నా ఎక్కువ మంది హాజరు కావడానికి వీల్లేదు.

అదే విధంగా ఇన్ డోర్ లో జరిగే సమావేశాలకు వేడుకలకు కేవలం 100 మందికి లోబడి మాత్రమే అతిధులు హాజరు కావాల్సి ఉంటుంది.

కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలలో రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాన్ని ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.

పంజాబ్ రాష్ట్రం మొత్తంలో అన్ని చోట్లా ప్రజలు మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే తెరిచిన సినిమా హాళ్లపై విధించాల్సిన ఆంక్షలకు సంబంధించి మార్చి 1వ తేదీన నిర్ణయం తీసుకుంటారు.

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ముందుగా ఆరోగ్య శాఖ సిబ్బందికి, వైద్యులకు నూటికి నూరు శాతం వ్యాక్సిన్ అందచేయాలని ఆయన కోరారు.  

Related posts

ఒక పూట అన్నం మానేసి పేదలకు పంచిపెట్టండి

Satyam NEWS

తెలంగాణ అమరులకు సైబరాబాద్ పోలీసులు నివాళి

Bhavani

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించిన పోలీసులు

Murali Krishna

Leave a Comment