39.2 C
Hyderabad
April 18, 2024 17: 26 PM
Slider ప్రపంచం

కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌లో భారీ మోసం

కరోనా కారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన కోవిడ్‌19 సహాయ కార్యక్రమాల నుంచి దాదాపు రూ.100 బిలియన్‌ డాలర్ల కుంభ కోణం జరిగినట్లు యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ తెలిపింది.

సీక్రెట్‌ సర్వీస్‌ కేసులు, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌, స్మాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి వచ్చిన డేటా ప్రకారం అంచనాను గుర్తించారు. సీక్రెట్‌ సర్వీస్‌లో న్యాయ శాఖ ప్రాసిక్యూట్‌ చేసిన కోవిడ్‌ 19 ఈ కేసును చేర్చలేదు. ఈ మోసం కేసుల్లో ఇప్పటి వరకు 2.3 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులను రికవరీ చేసింది.

100మందికిపైగా అనుమానితులను అరెస్టు చేసినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ తెలిపింది. అయితే కరోనా ప్రారంభం నుంచి యూఎస్‌ ప్రభుత్వం కోవిడ్‌ బాధితుల కోసం కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌లో సుమారు 3.5 ట్రిలియన్‌ డాలర్లను వెచ్చించింది.

ప్రెసిడెన్షియల్‌ ప్రొటెక్షన్‌లో నైపుణ్యం ఉన్నవారే ఈ నిధుల మోసానికి పాల్పడి ఉంటారని సీక్రెట్‌ సర్వీస్‌ భావిస్తోంది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుపుతోంది. ఇంకా ఎంత మంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది.

Related posts

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నల్ల బ్యాడ్జీలతో వెళ్ళండి

Satyam NEWS

రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

Satyam NEWS

[Best] Dr. Weil Lower Blood Pressure Mezcal To Lower Blood Pressure Can Curcumin Lower Blood Pressure

Bhavani

Leave a Comment