31.7 C
Hyderabad
April 25, 2024 01: 47 AM
Slider ఆధ్యాత్మికం

గోమాత…హైందవజాతికి మూలాధారం…!

#Cow Puja

గోవు విశ్వమాత అని, మన భారతీయ సంస్కృతికి మూలాధారం గోవు అని  వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ మేరకు విజయనగరం లో గోపూజ ఉత్సవంలో భాగంగా  శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి దేవాలయంలో  దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోపూజ ఉత్సవంలో జరిగింది వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య గోమాతకు ఆమె పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోపూజ చేయడం ద్వారా వ్యక్తిగత దోషాలతో పాటు, సంస్థాగతంగా ఉన్న దోషాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం అని అన్నారు. పురాణాలలో గోపూజకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గోవు లో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారన్నది ప్రజల విశ్వాసమన్నారు.. గోవు లో  సర్వ దేవతలు మూర్తిభవించి ఉంటారు కనుక ఆ దేవతలు ఆశీర్వదిస్తారని అది ప్రజలసంపూర్ణ విశ్వాసం అని  అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మన సనాతన సంప్రదాయాలను కాపాడే విధంగా అన్ని దేవాలయాల్లో గో పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. గోమాతకు విశేష పూజలు చేసిన వారిలో పార్టీ నగరపాలక అధ్యక్షులు ఆశపు వేణు,   సుజాత దంపతులు, పార్టీ సీనియర్ నేతలు ఎస్ వి వి రాజేష్,  గుడిసె శ్రీనివాస్,  ముచ్చు నాగలక్ష్మి, మీసాల రమాదేవి గోమాతకు విశేష పూజలు చేసిన వారిలో ఉన్నారు. ఆలయ ఈవో కె.వి.రమణ పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య గోపూజ ఉత్సవం ఘనంగా జరిగింది.

Related posts

జీవనది

Satyam NEWS

న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది

Satyam NEWS

రాయలసీమ దక్షిణ కోస్తాపై మళ్లీ అల్పపీడన ప్రభావం

Bhavani

Leave a Comment