39.2 C
Hyderabad
March 29, 2024 15: 54 PM
Slider నెల్లూరు

చింతారెడ్డిపాలెం సెంటర్ లో రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

cpi for bridge

ప్రజల ప్రాణాలను హరిస్తున్న చింతా రెడ్డిపాలెం సెంటర్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి లను నిర్మించాలని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ 16 డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు నేషనల్ హైవే సింహపురి హాస్పిటల్ సెంటర్ దగ్గర ప్రజలు ప్రాణాలు కాపాడండి అంటూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ చింత రెడ్డి పాలం పాలం పాలం గ్రామాలనుండి నెల్లూరు నగరంలో కి జీవనోపాధికై ప్రతిరోజు వందలాది మంది పేదలు జాతీయ రహదారి ఏర్పడక ముందే నుండి రాకపోకలు సాగిస్తూ ఉండేవారని, జాతీయ రహదారి నిర్మాణం తర్వాత ఈ ప్రాంత ప్రజలు అండర్ బ్రిడ్జి నిర్మించడంతో ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారిందని అన్నారు. జాతీయ రహదారి నిర్మించిన అప్పటి నుండి అతివేగం వల్ల వచ్చే వాహనాల కారణంగా సుమారు 150 మంది వరకు ప్రమాదాలకు గురై తమ ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అదేవిధంగా జిల్లా నలుమూలల నుంచి సింహపురి హాస్పిటల్ కి ఇక్కడ రోగులు నిరంతరం వస్తుంటారని నారాయణ హాస్పిటల్ అదేవిధంగా విద్యా సంస్థలు ఈ బైపాస్ హైవే నుంచే దాటాల్సిందేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ నెల్లూరు నగరంలో నాలుగు చోట్ల ఫ్లైఓవర్ నిర్మించాలని అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు మినిస్టర్ అనిల్ యాదవ్ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వారిని కూడా కలిసి తమ సమస్యలను కూడా వాళ్లకు వివరించి అర్జీలు కూడా ఇస్తామని చెప్పి ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జి.నాగేశ్వరరావు పి సూర్యనారాయణ కొట్టం రామ్మూర్తి పి శంకర్ ర్ సింగి రెడ్డి మధుసూదన్ రెడ్డి  ఏ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గడ్డి గాడిదకు వేస్తే బర్రె పాలిస్తుందా?

Satyam NEWS

లెజెండ్స్: మహా మహితాత్ములు మన శాస్త్రవేత్తలు

Satyam NEWS

విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

Satyam NEWS

Leave a Comment