రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే చర్య జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు వార్తలు రాయకూడదు.. ప్రచురించకూడదంటూ జీవో 2430ను విడుదల చేయడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజే పత్రికలు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జీవో 2430కు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రులే ఎంస్‌వోలను బెదిరించి అప్రకటితంగా ఏబీఎన్ ఛానల్‌ను నిషేధించారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జీవో 2430ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
previous post