39.2 C
Hyderabad
April 18, 2024 16: 03 PM
Slider చిత్తూరు

కేసుల మాఫీ కోసమే సిఎం జగన్ మోడీకి సలాం చేస్తున్నారు

#CPINarayana

తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి సిఎం జగన్ ప్రధాని మోడీ కాళ్ళుకు సలాం చేస్తున్నారని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అనుచిత పాలన పై ఆందోళన చేస్తే చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారని అంటూ, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని పేర్కోన్నారు. అప్పట్లో అమరావతిని అఖిల పక్షాలు ఆమోదించాయి, ఇప్పుడు వైకాపా అమరావతి వద్ధంటే రైతులకు మద్ధతుగా నిలవకూడదా అంటూ ప్రశ్నించారు.

గతంలో ఎన్నికల కమీషన్ ఎన్నికలను వాయిదా వేస్తే 75ఆర్టికల్ ప్రకారం ఎన్నికలు జరపకపోతే నిధులు రావన్న ప్రభుత్వం, నేడు ఎన్నికల వాయిదా కు పోవడం విడ్డురంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కాబట్టి మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ జరపాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు.

సిఎం జగన్ దొంగాటలు మానుకుని  ప్రజాపక్షాన నిలబడితే మంచిదన్నారు. కేంద్ర,రాష్ట్ర పాలన పై వ్యతిరేకంగా ప్రజలు, రైతులు కోసం అందోళనలు చేస్తుంటే, కోవిడ్ ను చూపి అడ్డుకుంటున్నారని, కోవిడ్ నెపంతో  సిఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు.

జగన్ లోపాయకారి రాజకీయాలను మానుకుని కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్ టీ బకాయిలు నాలుగువేల కోట్లు ,పోలవరం నిధులు ,ప్రత్యేకహోదా వంటి అంశాలపై దృష్టి పెట్టి పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  చిన్ని రాజ్, క్రిష్ణమూర్తి, జనసేన నాయకులు తడ శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మన సరిహద్దుల్లో చైనా కొత్త ఎత్తుగడ

Satyam NEWS

నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు మంజూరుచేయాలి

Bhavani

ఉత్తరాఖండ్లో నదిలో చిక్కుకున్న బస్సు

Bhavani

Leave a Comment