33.2 C
Hyderabad
April 26, 2024 02: 47 AM
Slider నల్గొండ

పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి: సిపిఐ

#cpihujurnagar

అనునిత్యం పెట్రోల్,డీజిల్ ధరలు పెంచటం వలన సామాన్య,మధ్యతరగతి ప్రజల జీవనం కష్టతరమైందని సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండల కేంద్రము లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిపిఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నరేంద్రమోడీ బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్ధిక విధానాల వల్ల సామాన్య ప్రజలు కడుపునిండా తిండి తినే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు.పెట్టుబడి దారుల ఆస్తులు కరోనా సమయంలో కూడా వంద రెట్లు అధికంగా పెరిగాయని,నరేంద్రమోడీ ప్రభుత్వం పెట్టుబడి దారుల ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెరిగిన డీజిల్,పెట్రోల్,వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడు కడియాల అప్పయ్య,జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి బాదె నర్సయ్య,సిపిఐ పార్టీ మండల నేతలు చేవ వెంకన్న,షేక్ పీర్ సాహెబ్,ఆతుకూరి రామాంజనేయులు, షేక్ బాల సైదులు,మెండెం లింగరాజు, కడియాల చిన అప్పయ్య, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గుడ్ గవర్నెన్స్:పోలీసుల పట్ల గౌరవం పెంచేందుకు చర్యలు

Satyam NEWS

పార్షియల్: స్థానిక పోలీసులపై వైసీపీ ఎంపి ఫిర్యాదు

Satyam NEWS

ఎమ్మెల్యే ప్రసన్న మంత్రి కావాలి

Bhavani

Leave a Comment