33.2 C
Hyderabad
April 26, 2024 01: 57 AM
Slider గుంటూరు

మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు: సిపిఐ 

#saveamaravati

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని కోరుతూ శుక్రవారం మంగళగిరి అంబేద్కర్ విగ్రహం ఎదుట మంగళగిరి నియోజకవర్గ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య సహాయ కార్యదర్శులు కంచర్ల కాశయ్య మాట్లాడుతూ ఏపీరాజధాని అంశంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందేందుకు సీఎం జగన్, ప్రయత్నిస్తున్నారనీ అన్నారు.

ఓట్ల రాజకీయంలో భాగమే సియం జగన్,మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా జగన్, వ్యవహారిస్తున్నాన్నారు. మళ్లీ పాలనా వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

అమరావతి ప్రాంతం రాష్ట్రం నడిబొడ్డుగా ఉండడం వల్ల రాజధానిగా అనువైనదిగా ఉంటుందన్నది వాస్తవమని,అమరావతి రాజధాని విషయంలో వివాదం సృష్టించి మూడేళ్లపాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని ,రాష్ట్రాభివృద్ధిని కుంటుపరిచారన్నారు.

ఒకరకమైన దురాలోచనతో జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, ఓట్ల రాజకీయంతో అమరావతి రాజధాని అంశాన్ని మరోమారు వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. అధికారం ఉంది కదా అని ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడితే ప్రజలు క్షమించబోరన్నారు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చర్చ పెట్టి మళ్లీ మూడు రాజధానుల చట్టంచేయాలని ప్రయత్నించడం జగన్ కు సమంజసం కాదని, ఈ వైఖరి న్యాయ వ్యవస్థలను ధిక్కరించడమేనన్నారు.

రాజధాని అమరావతి అభివృద్ధికి,వికేంద్రీకరణకు పోటీ పెట్టడం సరికాదన్నారు. కోర్టులపట్ల గౌరవం వుందన్న ముఖ్యమంత్రి హైకోర్టు తీర్పును అమలు చేసి వివాదాలకు స్వస్తి చెప్పాలని కోరారు. పరిపాలన, శాసన రాజధానిగా అమరావతి కొనసాగించాలన్నారు ఇప్పటికైనా రాజధాని పై న్యాయపరమైన, ఇతర వివాదాలు కొనసాగించకుండా, విభజన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించేలా ఒత్తిడి తేవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు,మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, గంజి వెంకయ్య,తాడేపల్లి పట్టణ సహాయ కార్యదర్శి తుడిమేళ్ల వెంకటయ్య, జి.శివ, షైక్ బాషా, ఉయ్యాల సత్యనారాయణ, శంకర్, సత్యనందం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రాజెడీ:రోడ్డు ప్రమాదంలో పోలీసు అధికారి మృతి

Satyam NEWS

రాజంపేటలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Satyam NEWS

21న సిద్ధి వెంకటేశ్వర్లు వర్ధంతి

Bhavani

Leave a Comment