39.2 C
Hyderabad
March 28, 2024 16: 34 PM
Slider విజయనగరం

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కు హెలికాప్టర్ ద్వారా పూల వర్షంపై సీపీఎం కామెంట్

#raghavulu

ప్రస్తుత పాలకుల చేతుల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని సీపీఎం నాయకుడు రాఘవులు విమర్శించారు. విజయనగరం లో  మెసానిక్ టెంపుల్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతలా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటే….డా ప డిప్యూటీ స్పీకర్ వస్తే హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కుల పి కురిపించే స్థాయి కి వచ్చామని రాఘవులు ఎద్దేవా చేశారు. ఈ పూల వర్షం జార్జ్ బుష్ వచ్చినా…బిల్ క్లింటన్ వచ్చినప్పుడు జరిగి గాయన్నారు. ఈ నేపథ్యంలో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థ కు తూట్లు పొడుస్తున్నాయని రాఘవులు ఆరోపించారు. సామాన్యుడు మాత్రం దయనీయ స్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ వ్యవస్థ ను నాశనం చేసి…75 ఏళ్ల స్వాతంత్ర్య స్పూర్తి ని కాల గర్భంలో కలిపేసారని రాఘవులు తీవ్రంగా విమర్శించారు.

Related posts

టీడీపీని ప్రక్షాళన చేయకపోతే బతకడం కష్టం

Satyam NEWS

దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరిన సీఎం

Satyam NEWS

అటవీ భూముల పట్టా పొందిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

Satyam NEWS

Leave a Comment