30.7 C
Hyderabad
April 19, 2024 09: 19 AM
Slider నల్గొండ

గుడ్ వర్క్: పేదలకు నిత్యావసరాలు పంచిన సిపిఎం

#CPMNakrekal

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు లేని అర్హత కలిగిన పేదలందరికీ ఉచిత బియ్యం, రూ. 1500 నగదు అందించి ఆదుకోవాలని CPM కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆదివారం నాడు మే డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు 60 మంది పేద కుటుంబాలను గుర్తించి కొన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డు లేని పేదలను గుర్తించి ఒక్కొక్కరికి 12కిలో ల బియ్యం, నగదు బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు CPM తరపున లేఖ రాసినట్లు చెప్పారు.

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఫ్రీగా పంచుతారు

నకిరేకల్  నియోజకవర్గంలోని చిట్యాల మండలం లో 700, రామన్నపేట మండలంలో 670 మంది పేద కుటుంబాలకు చెందిన వారు గత ఏడాది క్రితమే రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకున్నా కొత్త కార్డ్ లు ఇవ్వలేదని, వారందరినీ ఆదుకోవాలని కోరారు. ఎన్నికల  సమయంలో అడగకుండానే డబ్బులు, మద్యం, చీరలు ఏది పడితే అది పంచిన నాయకులు, కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఎందుకు అవసరమైన వస్తువులు పంపిణీ చేయరని ప్రశ్నించారు.

అనంతరం పార్టీ జండాను ఆవిష్కరించారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న పార్టీ నాయకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జిట్ట నగేష్, మండల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, శీలా రాజయ్య, రాచకొండ శ్యామ్ సుందర్, బూరుగు విజయ్, శీను, గోపాల్ రెడ్డి, బిక్షంరెడ్డి,యాదయ్య, నరేందర్, గోపి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ గూటికి వైసీపీ నేత ఏలూరి రామచంద్రారెడ్డి

Satyam NEWS

హై పర్ఫామెన్స్ ట్రైనింగ్ షూటింగ్ సెంటర్ ప్రారంభం

Satyam NEWS

పార్టీ క్యాడర్ లో జోష్ నింపిన జనసేనాని తిరుపతి పర్యటన

Satyam NEWS

Leave a Comment