29.2 C
Hyderabad
September 10, 2024 15: 56 PM
Slider కృష్ణ

సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు

cbn

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఎం నేతలు కలిశారు. సచివాలయంలో గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎంకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు నిర్ణయం, పెన్షన్లు రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంపు, త్వరలో అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించాలని సీఎంను కోరారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయడంతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలన్నారు.

Related posts

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

Sub Editor 2

చర్లపల్లి డివిజన్ మధుర నగర్ లో jio సెల్ టవర్ ఎత్తివేయాలి

Satyam NEWS

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిద్దాం

Bhavani

Leave a Comment