32.2 C
Hyderabad
April 20, 2024 21: 43 PM
Slider విజయనగరం

సీపీఎం కార్యాలయం లో చొరబడి నేతలను అరెస్టులు చేసిన ఖాకీలు..!

#CPM Vijayanagaram

ఉద్యోగాలు అడిగినందుకు విద్యార్థి, యువజన నాయకులు పైనా, వారికి అండగా వుంటున్నారని సీపీఎం నాయకులపై నా పోలీసులు ప్రతాపం చూపించారు. సీపీఎం కార్యాలయంలో  చొరబడి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూఢడ్ల కృష్ణమూర్తితో పాటు జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ్ సభ్యులను,ఎస్ ఎఫ్ ఐ, డివై ఎస్ ఐ నాయకులను కార్యాలయంలో ఉన్న వారిని బలవంతంగా ఈ డ్చుకోపోయి పోలీసులు అరెస్టు చేశారు. 

ఎస్ ఎఫ్ ఐ, డి వై ఎఫ్ఐ, నిరుద్యోగ సాధన సమితి ఇచ్చిన బైక్ ర్యాలీ నేపథ్యంలో విజయనగరం పోలీసులు తోటపాలెం లో ఉన్న సీపీఎం కార్యాలయం లోపలికి వచ్చి ఎస్ ఎఫ్ ఐ, డి వై ఎఫ్ఐ నాయకులను నిర్బంధించారు. కార్యాలయం లో పలికి రావడం సరికాదని,నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని ,అరెస్టులు చేయాలనుకుంటే రోడ్డుపై కార్యక్రమం చేస్తే మీ ఆదేశాలు ప్రకారం చేసుకోవాలని కార్యాలయం లోపలికి రావడం సరికాదని పోలీసులతో.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి అన్నారు.

మా ఆదేశాలు ప్రకారం మేము అరెస్ట్ చేస్తామని కార్యాలయమే కాదు ఎక్కడికైనా వస్తామని ఎస్ ఎఫ్ ఐ నేతలను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పడంతో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది.నగరంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎల్జీభవన్  కార్యాలయం లోపలికి రావడమే కాకుండా అన్ని తలుపులు మూసేసి నిర్బంధించడం హేయమైన చర్య అని ఆరోపించారు.

ఇది ప్రజల కార్యాలయమని ,ఇక్కడున్నది ప్రజలు కోసం పని చేసే నాయకులని ఈ విధంగా పోలీసులు కార్యాలయాన్ని వారి అదుపులోకి తీసుకోవడం సరికాదని పోలీసులు తీరుపై సీపీఎం, సీఐటీయు,ఎస్ ఎఫ్ ఐ, డి వై ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు.

పోలీసులు తీరును నిరసిస్తూ సీపీఎం నాయకత్వం నిరసన ర్యాలీ చేస్తామని బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేసారు.సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం నేరమా,రాజ్యాంగం కల్పించిన హక్కును అమలు చేయాల్సిన పోలీసులు ఈ విధమైన దౌర్జ్యనానికి దిగడం ఎంతవరకు న్యాయమని కృష్ణమూర్తి ప్రశ్నించారు.

ఇది ప్రజా స్వామ్య పాలన, నియంత పాలన అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడగడం నేరమా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రజలు గొంతుకు నొక్కాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.ఈ మేరకు వన్ టౌన్ టూటౌన్ సీఐలు మురళీ, లక్ష్మణరావు లు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

Related posts

శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామికి త్రిదళ మారేడు లక్ష బిల్వార్చన

Satyam NEWS

రాష్ట్రపతికి లేఖ: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్న జగన్

Satyam NEWS

మహా శివరాత్రి ప్రత్యేకం: ఆది అంతం…. అంతా ఆయనే…

Satyam NEWS

Leave a Comment