27.7 C
Hyderabad
April 24, 2024 09: 58 AM
Slider నిజామాబాద్

భూకబ్జా పై నిరసన సెగ: సీపీఎం ధర్నా

#cpmprotest

కబ్జాకు గురైన నిరుపేదల భూమిని సదరు లబ్దిదారులకు అప్పగించాలని కోరుతూ సీపీఎం జుక్కల్ జోన్ కన్వీనర్ సూరేష్ గొండ ఆధ్వర్యంలో రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో ధర్నా  చేశారు. కబ్జా దారులపై చర్యలు తీసుకొని మధన్ హిప్పర్గ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు అప్పగించాలని కోరారు.

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం లో  సీపీఎంజుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ అధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు.మండలం లోని మధన్ హిప్పర్గ గ్రామానికి చెందిన నిరుపేదలకు ప్రభుత్వం  మంజీర నది ముంపు కు గురౌతున్నారని చెప్పి 20 ఎండ్ల క్రితం గ్రామానికి చెందిన పలువురు పెద్దల దగ్గరప్రభుత్వం 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి మంజీర నది ముంపు బాధితులకు ఇండ్ల స్థలాలను పంపిణీ పట్టాలను అందించారు.ప్రస్తుతం నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని భూమిని అమ్మిన పెద్దలే పాగ వేసి కబ్జా చేస్తున్నారు.దీంతో సంబంధిత లబ్దిదారులు సీపీఎం నాయకుల సహకారంతో నిరసన చేపట్టారు .కబ్జా దారుల పై చట్ట పరమైన చర్యలు తీసుకోనీ న్యాయం చేయాలంటూ సీపీఎం నేత సురేష్ గోండ అధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.కార్యక్రమం లో హన్మాన్ షింగ్, బాలాజీ పాటిల్, మోతిరం, కోలా నారాయణ, మాజి ఎంపి టి సి కె. రాములు, ఆడేప్ప, శ్రీనివాస్, వినోద్, సాయిలు, గంగాధర్, అశోక్, బలరాం, తదితరులు పాల్గొన్నారు.

జీ.లాలయ్య సత్యం  న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ

Satyam NEWS

టీ20: ఫామ్ లో ఉన్న భారత్ గెలుపు సుళువే

Satyam NEWS

డెవలప్మెంట్ :సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలి

Satyam NEWS

Leave a Comment