30.7 C
Hyderabad
April 19, 2024 07: 08 AM
Slider నల్గొండ

ఏళ్లు గడుస్తున్నా పేదల గోడు పట్టని ప్రభుత్వం

#CPM Chityala

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం నేరడ గ్రామంలో పేదల ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చిన భూమిని పంపిణీ చేయాలని సిపియం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం గ్రామ పంచాయతీ ముందు ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ  నేరడ గ్రామంలో  పేదలకు  నివాస గృహాలు నిర్మించి ఇవ్వడానికి 25సంవత్సరాల క్రితం అప్పటి  శాసనసభ్యుడు  నంద్యాల నర్సింహారెడ్డి తమ నిధుల నుండి ఖర్చు పెట్టి సర్వే నెంబర్ 290లో 13ఎకరాల14 గుంటల భూమి ని కొనుగోలు చేసి 300 పైగా లబ్దిదారుల కు పట్టాలు ఇప్పించారని అన్నారు.

కానీ ఆ ప్రాంతంలో పేదలు నివసించటానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంతో పేదలు తమ నివాసాలను ఏర్పాటు చేసుకోలేకపోయారని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజమైన లబ్దిదారుల ను గుర్తించి గతంలో ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమి ని పంపిణీచే సి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండు చేశారు. అనంతరం కారోబారు సత్యనారాయణ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపియం పార్టీ శాఖా కార్యదర్శి మందుగుల యాదయ్య పాల్గొన్నారు.

ఇంకా, కందగట్ల గణేష్, కల్లూరి లక్ష్మయ్య, వడ్డెపల్లి యల్లయ్య, సంకోజు నర్సింహాచారి, పిల్లలమర్రి లక్ష్మయ్య, పోలోజు ఈశ్వరాచారి, కల్లూరిశత్రయ్య, ఐతరాజు అంజయ్య, యాదయ్య, సత్తయ్య, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆఫ్టర్ కరోనా: కార్పొరేట్ కాలేజీలు మూతపడటం ఖాయం

Satyam NEWS

విజయనిర్మల మనవడు శరణ్ సినిమా రెగ్యులర్ షూటింగ్

Satyam NEWS

సైరా విడుదల తేదీ పై సంశయం వద్దు

Satyam NEWS

Leave a Comment