39.2 C
Hyderabad
March 28, 2024 14: 07 PM
Slider మహబూబ్ నగర్

నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

sp nagarkarnool

షాద్ నగర్ ఏరియాలో జరిగిన   ప్రియంక రెడ్డి  హత్య వంటి ఫిర్యాదులపై  వెంటనే స్పందించాలని, డైల్-100 వంటి సేవల గురించి  అన్ని పోలీస్ స్టేషన్ లో  ప్రజలకు అవగాహన కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా  ఎస్పి డాక్టర్ వై సాయి శేఖర్ కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కార్యాలయంలో ఆయన జిల్లా పోలీస్ అధికారులతో నేడు నెలవారి  నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ నేర సమీక్ష సమావేశంలో   డి ఎస్పి లు , సిఐ’లు,  ఎస్సైలు, ఇతర  పోలీస్  సిబ్బంది పాల్గొన్నారు. పాత కేసుల పురోగతి, గత నెలరోజులలో  జరిగిన కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. చేయాల్సిన  పనిని అధికారులకు సూచించారు. అలాగే  విచారణలో వున్నా పెద్ద కేసులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులు/ సమాచారం/ సహాయం/ కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, తగు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి కీలకపాత్ర నిర్వహించాలని  పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ప్రతి పౌరుని సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తే అది వారి మనసులో భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.

పోలీస్ స్టేషన్ అనేది ఒక  24 x7  పని చేసే  సేవా కేంద్రం లాంటిది అనే భావన వారికి కలిగేలా ప్రవర్తిస్తూ, స్టేషన్ లోని వివిధ అధికారులతో సమన్వయం చేసుకుని తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థ పై నమ్మకం, విశ్వాసం కల్పించడంలో రిసెప్షన్ అధికారి ముఖ్య పాత్ర పోషించాలని తెలిపారు. అదేవిధంగా టెక్ వాడటం, ఈ- కాప్స్, ఈ –పెట్టి కేసు ల గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,  డైల్ 100, వాట్స్ యప్ గ్రూప్, మొబైల్ పెట్రోల్లింగ్  వంటి వాటి పై  పూర్తి  అవగాహన  కలిగి  బాధ్యతలు నిర్వహించడంలో నిజాయితీ పారదర్శకత జవాబుదారిగా ఉండాలన్నారు.

గ్రామం లో కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచాలని,  అసాంఘిక శక్తుల నుంచి ప్రజలు అప్రమతంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసులకు 100 డైల్ ద్వారా గాని, ఇతర మార్గాల ద్వారా గాని, సమాచారం ఇవ్వాలని  ప్రజలకు అవగహన కల్పించాలని తెలియజేశారు.

అదేవిధంగా ప్రజలందరు తమ గ్రామ భద్రత నిమిత్తం ,పట్టణలలో,  తమ  కాలనీ లో” నేను సైతం/కమ్యూనిటీ సిసి కెమెరా ” కార్యక్రమం లో భాగంగా  సిసి కెమెరా లను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు తెలపాలని  సూచించారు. జిల్లాలో పెండింగులో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలని ఆదేశించారు. దొంగతనాల నివారణ గురించి పగలు రాత్రి గట్టి పెట్రొలింగ్, బీట్లు నిర్వహించాలని సూచించారు.

FIR తరువాత చేసే నేరపరిశోధనలో పార్ట్-2 లలో  ఇన్విస్టిగేషన్ అధికారి మాత్రమే స్వయంగా వ్రాత పూర్వకంగా వివరాలు నమోదు చేయాలని అన్నారు. నేరస్తులకి తక్కువ సమయంలో చట్టప్రకారం శిక్షపడేలా నాణ్యమైన  విచారణ కొనసాగలని ఆయన అన్నారు. లాంగ్ పెండింగు కేసులని ఛేదించాలి ఆయన కోరారు. పోలీస్టేషన్ రికార్డులను, పరిసరాలను, శుభ్రంగా ఉంచుకోవాలి సూచించారు.

ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ- పెట్టి కేసులను ఆన్లైన్లో  నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎస్పి లు గిరి బాబు, నర్సిహ్ములు, మోహన్ రెడ్డి, సీఐ  లు రామకృష్ణ, సైదులు,  గాంధీ నాయక్, బీసన్న, నాగరాజు, శ్రీకాంత రెడ్డి, జిల్లా  లోని  ఎస్సైలు, ఐటి కోర్ సిబ్బంది నర్సింహులు, నాగరాజు, విక్రం,  కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అంతర్గత భద్రతపై పరస్పర సహకారం

Satyam NEWS

జగన్ ఢిల్లీ టూర్ రహస్య ఎజెండా ఇదేనా?

Satyam NEWS

రాజంపేట టీడీపీ లో పెరుగుతున్న ఆశావహులు

Satyam NEWS

Leave a Comment