35.2 C
Hyderabad
April 20, 2024 15: 33 PM
Slider విజయనగరం

ఛీటింగ్ కేసుల్లో ప్రణాళికాబద్ధంగా దర్యాప్తు పూర్తి చేయాలి

#dipika

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ దర్యాప్తులో ఉన్న చీటింగు కేసులను ప్రత్యేకంగా సమీక్షించి, చీటింగు కేసుల్లో దర్యాప్తును ప్రణాళికాబద్ధంగా, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సివిల్ తగాదాలపై వచ్చిన ఫిర్యాదుల్లో డాక్యుమెంట్లును పరిశీలించి, రెవెన్యూ అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పెండింగు లో ఉన్న గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు న్యాయస్థానాల నుండి వచ్చిన తక్షణమే ఎగ్జిక్యూట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపైన, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైనా కఠినంగా వ్యవహరించాలని, కేసులు నమోదు చేయాలన్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని, ప్రజలు, వాహన దారులకు హెల్మెట్ ధారణ, రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలన్నారు. రహదారి భద్రత నియమాలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని, సైబరు నేరాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గత మాసంలో నమోదై, దర్యాప్తు పెండింగు లో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, నిర్దిష్ట రోజుల్లోగా సంబంధిత న్యాయ స్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక దిశా నిర్దేశం చేసారు.

ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ,బెస్ట్ పెర్మాఫర్ గా జామి ఎస్ఐ కు అవార్డ్ ను, జిల్లా పోలీసుశాఖలో విధులను సమర్ధవంతంగా నిర్వహించి, దొంగతనం కేసులను ఛేదించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  నేర సమీక్షా సమావేశంలో అభినందించి, జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందజేసారు.

విజయనగరం జిల్లాలోని జామి, ఎస్.కోట, ఎల్.కోట, డెంకాడ మరియు విజయనగరం రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన ఆరు ట్రాక్టర్ల దొంగతనం కేసుల్లో ముద్దాయిలను అరెస్టు చేసి, చోరీ అయిన ట్రాక్టర్లును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన జామి ఎస్ఐ జి.వీరబాబు కు “బెస్ ఫెర్మార్”గా ఎంపిక చేసి, అభినందించి, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను జిల్లా ఎస్పీ ఎం. దీపిక బహూకరించారు.

అదే విధంగా జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో వివిధ విధులు నిర్వహిస్తూ, చోరీ కేసులు చేధించుట, చోరీ సొత్తు రికవరీ చేయుటలోనూ, అమ్మవారి జాతర్లులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించుటలోనూ, ట్రాఫిక్ విధులు సక్రమంగా నిర్వహించుటలోను, లోక్ అదాలత్లో కేసులు రాజీ చేయుటలోను, నిందితులకు శిక్షపడుటలోను, తప్పిపోయిన వ్యక్తుల అచూకీ కనిపెట్టుటలోను , నాన్ బెయిలబ్బుల్ వారెంట్లును ఎగ్జిక్యూట్ చేయుటలో ప్రతిభ కనబర్చిన

(1) టూటౌన్ సిఐ సిహెచ్. లక్ష్మణరావు (2) చీపురుపల్లి సిఐ జి. సంజీవరావు (3) వన్ టౌన్ ఎస్ఐ ఎస్.బాస్కరరావు (4) 1వ పట్టణ ఎఎస్ఐ ఎల్.జగన్మోహనరావు (5) వంగర హెచ్.సి. వి. రామకృష్ణారావు (6) వంగర హెచ్.సి. కె.టి.రాజు (7) సంతకవిటి హెచ్.సి. ఇ.తారకేశ్వరరావు (8) విజయనగరం ట్రాఫిక్ హెచ్.సి. పి.శ్రీనివాసరావు (9) టూటౌన్ పిసి ఆర్. నారాయణరావు (10) 2వ పట్టణ పిసి ఆర్. శ్రీనివాసరావు

(11) గుర్ల పిసి కె.కోటేశ్వరరావు (12) దిశా మహిళా విని బి. మీనాక్షి (13) గంట్యాడ పిసి కె.త్రినాధరావు (14) పూసపాటిరేగ పిసి ఎన్. వాసు (15) నెల్లిమర్ల పిసి డి.రామారావు (16) బొబ్బిలి పిఎస్ పిసి కె. లక్ష్మణరావు (17) బాడంగి పిసి కె.శంకర్ (18) గజపతినగరం పిసి టి.వి.తిరుపతిరావు (19) బొండపల్లి పిసి ఎల్. వాసుదేవరావు (20) ట్రాఫిక్ హెూంగార్డు పి. పైడిచిట్టి (21) బాడంగి హెూంగార్డు సిహెచ్ కృష్ణలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.

ఈ సమీక్షా సమావేశంలో సెబ్ అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం ఇన్ చార్జ్ డిఎస్పీ ఆర్. శ్రీనివాస రావు, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహన రావు, న్యాయ సలహాదారులు వై. పరశురాం, డిపిఓ ఎఓ వెంకట రమణ, సిఐలు జె. మురళి, సిహెచ్. రుద్రశేఖర్, బి.వెంకటరావు, సిహెచ్. లక్ష్మణరావు, టి.వి. తిరుపతిరావు, ఎస్.బాల సూర్యారావు, విజయనాధ్, ఎల్. అప్పలనాయుడు, ఎం.నాగేశ్వరరావు, ఎస్.తిరుమలరావు, జి.సంజీవరావు, హెచ్. ఉపేంద్ర, కె. రవికుమార్, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

జ్యుడిషియల్ అధికారుల నివాస స్థల పరిశీలన

Bhavani

ఆడ బిడ్డల ఆనందమే కే‌సి‌ఆర్ కు సంతోషం

Satyam NEWS

రాంచరణ్, ఉపాసన లకు కూతురు

Bhavani

Leave a Comment