39.2 C
Hyderabad
April 18, 2024 16: 55 PM
Slider విజయనగరం

Crime review: కఠిన వైఖరితోనే నేరాలు తగ్గుముఖం

#Vijayanagaram S P

విజయనగరం జిల్లా  ఎస్పీ రాజ‌కుమారీ జిల్లా కేంద్రంలో ఉన్న దండుమార‌మ్మ  టెంపుల్ లో జిల్లా‌ క్రైమ్ పై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.ఈ స‌మావేశానికి జిల్లాలో అన్ని స‌ర్కిళ్ల ప‌రిధిల‌లో క్రైమ్ కేసులు ఆ క్రైమ్ రికార్డ్స్ చూస్తున్న సిబ్బందితో ఎస్పీ..స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

జిల్లా ఎస్పీరాజకుమారి మాట్లాడుతూ  నాటుసారా, బెల్టుషాపుల పై కఠిన వైఖరితోనే వాటి నియంత్రణ సాధ్యమన్నారు. సారా, మద్యం విక్రయించే వారిని గుర్తించి, వారిని బైండోవరు చేయాలని, స్టేషన్  కు వచ్చే ఫిర్యాదుల్లోని అంశాలకు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత చట్టం, సెక్షనుల ప్రకారం ఎఫ్ ఐ ఆర్ లుగా నమోదు చేయాల‌ని ఆదేశించారు.

 తీవ్రమైన నేరాల ద‌ర్యాప్తు కేసుల‌ను వేగవంతం చేయాలని, నిందితులు శిక్షింపబడే విధంగా సాక్ష్యాలను సేకరించి చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలు, దాడులను తీవ్రంగా పరిగణించి, ఆయా కేసుల్లో దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మైనరు బాలికల పై జరిగే అఘాయిత్యాల పై నమోదైన పోక్సో చట్టం కేసుల ఎఓపిని తప్పనిసరిగా పాటించాలని, నిందితులను తక్షణమే అరెస్టు చేయడంతో పాటు వారిపై తప్పనిసరిగా రౌడీ షీట్లును తెరవాలన్నారు.

దిశ చట్టం గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడం, దిశ ఎ స్ ఓ ఎస్ యాప్ ను మహిళల మొబైల్స్ లో డౌన్లోడు చేసుకొనే విధంగా ఎంఎస్పీలు, మహిళామిత్ర, మహిళా రక్షక్ సభ్యుల సేవలను వినియోగించుకోవాలన్నారు. మిస్సింగు కేసులపై ప్రత్యే దృష్టి పెట్టి, వారి ఆచూకీ కని పెట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మిస్సింగు వ్యక్తుల వివరాలు ఎంఎస్ పిల వద్ద తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలన్నారు.

ప్రశంసా పత్రాల బహూకరణ

ఇక‌ కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి, ఎన్‌ఫోర్సుమెంటు కేసులు ఎక్కువ నమోదు చేసిన విజయనగరం టూటౌన్ సీఐ సిహెచ్. శ్రీనివాసరావు, విజయనగరం రూరల్ ఎస్ ఐ పి.నారాయణరావు, కొత్తవలస సీఐ జి. గోవిందరావు, పూసపాటిరేగ ఎస్ ఐ ఆర్. జయంతి, ఎస్. కోట ఎస్ ఐ నీలకంఠం, రామభద్రపురం ఎస్ ఐ ఎస్. కృష్ణ మూర్తి, దిశ ఎస్ ఓ ఎస్ యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను అదే విధంగా లఘు చిత్రాన్ని నిర్మించిన ఎల్విన్ పేట ఎస్ఐ కె. కృష్ణ ప్రసాద్, పీపీటీ నిర్వహణ చేసిన‌ ఐటి కోర్ హెచ్ సి జి.రవికుమార్, ఆడిట్ బిల్లుల నిర్వహణ చేసిన‌ రాంబాబు, రవికుమార్‌కు జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ వి.సత్యన్నారాయణ రావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, విజయ నగరం డీఎస్పీ అనిల్ పులిపాటి, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, సిసిఎస్ డిఎస్పీ జె. పాపా రావు, ఏఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి,

న్యాయ సలహాదారులు పరశురాం, సీఐలు బి.వెంకటరావు, ఎస్.శ్రీనివాసరావు, రుద్ర శేఖర్, డి. రమేష్, జె.మురళి, సిహెచ్. శ్రీనివాసరావు, టిఎస్ మంగవేణి, జి.గోవిందరావు, శ్రీధర్, జి.సంజీవరావు, ఎస్.సింహాద్రినాయుడు, శోభన్ బాబు, ఈ, కేశవరావు, సిహెచ్. లక్ష్మణరావు, విజయానంద్, ఈ. నర్సింహమూర్తి వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

బియ్యం చుట్టూ తిరుగుతున్న కారు కమలం కయ్యం

Satyam NEWS

సిఎం సహాయ నిధికి మైక్రోసాఫ్ట్ అధినేత విరాళం

Satyam NEWS

తెలంగాణలో త్వరలో నార్కోటిక్స్ స్పెషల్ వింగ్

Bhavani

Leave a Comment