37.2 C
Hyderabad
April 19, 2024 13: 29 PM
Slider ప్రత్యేకం

నేరచరితులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇస్తే ఎలా?

#varla ramaiah

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధులపై అభ్యంతరం తెలియజేస్తూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి  వర్ల రామయ్య రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు.

మంచి నడవడిక గల వారిని మాత్రమే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా గవర్నర్ నియమించవలసి ఉందని ఆయన గుర్తు చేశారు.

అయితే ముఖ్యమంత్రి ప్రతిపాదించిన నలుగురు అభ్యర్ధులలో ముగ్గురు నేరచరిత గలవారేనని ఆయన తెలిపారు.

దళిత యువకుడికి శిరోముండనం చేసి భారతదేశ వ్యాప్తంగా దళిత వ్యతిరేకిగా పేరుగాంచిన కేసును గత 20 ఏళ్లుగా విచారణ ఎదుర్కొంటున్న తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీగా ప్రతిపాదించడం చాలా దుర్మార్గమని ఆయన అన్నారు.

తోట త్రిమూర్తులుపైన రెండు రాష్ట్రాలలో ఇంకా చాలా క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయని ఆయన తెలిపారు.

అదే విధంగా లేళ్ల అప్పిరెడ్డి గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసునునని వర్ల రామయ్య అన్నారు. పోలీసు చరిత్రలో రౌడీ షీటర్ గా నమోదైన వ్యక్తి ఆయన అని వర్ల అన్నారు.

గుంటూరు మిర్చి యార్డు తగులబెట్టిన దాంట్లో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినపడిందని, ఇంకా ఎన్నో క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయని వర్ల తెలిపారు.

మూడవ వ్యక్తి రమేష్ యాదవ్ కూడా గతంలో ఒక హత్య కేసులో విచారణ ఎదుర్కొన్నట్లుగా తెలిసిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Related posts

ప్రమాదంలో గాయపడ్డ కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి

Satyam NEWS

కొత్త జిల్లాల్లో.. ఇక జిల్లా జడ్జీ కోర్టులు

Satyam NEWS

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వైసిపి భారీ సభ

Satyam NEWS

Leave a Comment