35.2 C
Hyderabad
April 20, 2024 17: 49 PM
Slider నల్గొండ

రైతు మేలు కోసమే నియంత్రిత సాగు విధానం

#MLA Chirumarthy

నియంత్రిత సాగు విధానం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో  నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

డిమాండ్ ఉన్న పంటల సాగుతో రైతులకు గిట్టుబాటు ధర సాధ్యమనే ఉద్దేశంతోనే  సీఎం కేసిఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రైతులంతా సంఘటితమై నూతన ఒరవడిని సృష్టించి ప్రభుత్వ సూచనల మేరకు సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 24 గంటల విద్యుత్,పంటకు పెట్టుబడి సాయం,విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ సేద్య పరికరాలపై రాయితీ కల్పిస్తున్నందున సాగుకు మినిమమ్ గ్యారెంటీ లభిస్తుందన్నారు. సన్నరకం వరి,పప్పు దినుసులు, కూరగాయలకు ప్రాధాన్యం  ఇవ్వలని, పత్తి రైతులకు పూర్తి స్థాయిలో సర్కార్ సహకారం ఉంటుంది అని అన్నారు.

Related posts

సీఎం, మంత్రికి పాలాభిషేకం

Sub Editor

పదిహేను రోజుల్లో నరసరావుపేటలో రోశయ్య విగ్రహం ఏర్పాటు

Satyam NEWS

ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Bhavani

Leave a Comment