27.7 C
Hyderabad
April 25, 2024 09: 03 AM
Slider మహబూబ్ నగర్

ఆన్ లైన్ పోర్టల్ లో పంటల నమోదు చేయించుకోవాలి

#agricultureofficer

పంటల ఆన్ లైన్ నమోదు ప్రక్రియ ను నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు పర్యవేక్షణ చేసారు. కొల్లాపూర్ మండలం లోని వరిదేల లో క్షేత్రస్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు.

జిల్లా  లోని రైతులు అందరూ యాసంగి సీజన్లో   వేసిన పంటలను విధిగా  నమోదు చేసుకోవాలని ఆయన  సూచించారు. ఆయా గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వే నంబర్ల వారీగా పంటలు నమోదు చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రతి రైతు వేసిన పంటలు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.

పంట కొనుగోలు, మద్దతు ధర విషయం లో ఇది రైతులకు ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు. అదే విధంగా రైతులు AEO ల, AO ల సూచనలు, సలహాలు పాటించి పంటల సాగు చేయాలని తెలిపారు. సస్య రక్షణ చర్యలు పాటించాలని తెలిపారు.

మండలం లోని వరిదేల లో పంటల నమోదు కార్యక్రమంలో ADA రవి , AO నాగరాజు, AEO శ్రీకాంత్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

చైనాలో కరోనా విస్పోటనం: రోడ్డు పక్కనే చికిత్స

Satyam NEWS

నిరుపేదలైన దళితులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS

గుడ్ గోయింగ్: మనేపూర్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment