36.2 C
Hyderabad
April 25, 2024 21: 18 PM
Slider తూర్పుగోదావరి

వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్న జనం

#kakinada

కరోనా ఉదృత పెరగడంలో ప్రజలు వేక్సిన్ కోసం వ్యాక్సినైజేషన్ కేంద్రాలకు క్యూలు కడుతున్నారు . అయితే ఆ సరఫరా చేస్తున్న డోసులకు వస్తున్న జనానికి పొంతన లేక పోవడంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

కాకినాడ నగర పాలక సంస్థ పక్కన గల మున్సిపల్ స్కూల్లో ప్రభుత్వ ఫ్రెంట్ లైన్ వారియర్లకు కోవాక్సిన్ రెండోవ డోసు వేస్తున్నారని ప్రచారం జరగడంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాదారణ జనం కూడా 3. వ్యాక్సిన్ కోసం భారీగా తరలి వచ్చారు.

దీంతో అక్కడ ప్రజలను నియంత్రించడం చాలా కష్టం కావడంతో టు టౌన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిననీ, అదుపులోకి తీసుకొని వచ్చారు. అధికారుల తీరు పై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వాక్సిన్ కేంద్రాన్ని అదనపు కమీషనర్ నాగనరసింహరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డి.పృధ్వీచరర్లు పర్యావేక్షించారు. ఈ సందర్భంగా అదనపు కమీషనర్ నాగనరసింహరావు మాట్లాడుతూ ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందనవసరం లేదని, 1 వ తేదీ నుండి కాకినాడ నగరంలో సుమారు 12 కేంద్రాలలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని వివరించారు.

Related posts

బాధితులకు అండగా నిలవండి

Bhavani

లాల్ దర్వాజా బోనాల జాతర.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

Bhavani

ఖబడ్దార్ మల్లారెడ్డి: కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment