20.7 C
Hyderabad
February 5, 2023 03: 52 AM
Slider జాతీయం

Big blast: తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబులు

#bombblast

పశ్చిమ బెంగాల్‌లోని ఒక టిఎంసి నేత ఇంటిలో అర్థరాత్రి బాంబు పేలుడు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఈ రోజు మేదినీపూర్‌లో టిఎంసి ప్రధాన కార్యదర్శి, సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ర్యాలీకి ముందు ఈ బాంబు పేలుడు సంభవించింది. మేదినీపూర్‌లోని కొంటాయ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

మేదినీపూర్‌లోని భూపతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జున్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న టీఎంసీ బూత్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ మన్నా ఇంట్లో రాత్రి పేలుడు సంభవించింది. అనంతరం పోలీసులు ఘటనా స్థలంలో రెండు మృతదేహాలను వెలికితీశారు. బాంబు తయారీ సమయంలో పేలుడు సంభవించిందని కొన్ని మీడియా కథనాలలో చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. టీఎంసీ బూత్ ప్రెసిడెంట్ ఇంట్లో బాంబు తయారు చేస్తున్నారని ఆరోపించారు.

Related posts

నిరాడంబరంగా హీరో నితిన్ నిశ్చితార్థం వేడుక

Satyam NEWS

ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దహనం

Bhavani

కూరగాయల మార్కెట్లలో ధరల పట్టికలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!