37.2 C
Hyderabad
March 29, 2024 18: 23 PM
Slider నెల్లూరు

క్రూయల్ వైఫ్: అక్రమ సంబంధం కోసం మొగుడి హత్య

husbend killed

నెల్లూరు నగరంలో కొత్తూరు శివారు ప్రాంతంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ దగ్గర గత నెల 22వ తేదీ ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఎస్పి భాస్కర్ భూషణ్ ఆదేశాలతో టౌన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేదాయపాలెం సీఐ సుబ్బారావు, ఎస్సైలు లక్ష్మణ్ రావు, పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు.

ఈ విచారణలో అత్యంత విషాదకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. చనిపోయిన వ్యక్తిని అతని భార్య అత్యంత దారుణంగా ప్రియుడితో కలిసి చంపించింది. సంవత్సరాల తరబడి కాపురం చేసిన భర్త కన్నా ఆరు నెలల క్రితం పరిచయమైన  ప్రియుడే ముఖ్యమని భావించి భర్తను అత్యంత పాశవికంగా ఆమె హత్య చేయించింది.

వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సూర్యనారాయణ, భద్రమ్మ భార్య భర్తలు. వీరు 2 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాకు వచ్చి బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రమ్మ సుధాకర్ అనే మేస్త్రి వద్ద బేల్దారి పనులకు పోతూ ఉండేది.

ఈ క్రమంలో గత ఆరు నెలల నుండి మేస్త్రి సుధాకర్ కి భద్రమ్మ కు అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త సూర్యనారాయణ పలుమార్లు భద్రమ్మ ను  హెచ్చరించినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. దీంతో భర్త సూర్యనారాయణ బంధువులకి ఈ విషయం చెప్పాడు.

బంధువులందరూ భద్రమ్మ ను  పద్ధతి మార్చుకోమని హెచ్చరించారు. దీంతో భర్త పై కోపం పెంచుకున్న భద్రమ్మ ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సుధాకర్ తో కలిసి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా కొత్తూరు సమీపంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద రెక్కీ నిర్వహించారు.

ఇక్కడైతే ఎవరు ఉండరని హత్య చేసి కాల్చి వేస్తే ఎవరికి అనుమానం రాదని ఇద్దరూ స్కెచ్ వేశారు. ప్లాన్ లో భాగంగా భార్య భద్రమ్మ భర్తతో కావాలని గొడవపడి అలిగి పోయినట్లు నటించింది. అనంతరం  హంతకుడు సుధాకర్ సూర్యనారాయణ కి ఫోన్ చేసి కొత్తూరు ప్రాంతంలో బేల్దారి పని ఇప్పిస్తాననీ మేనేజర్ కొత్తూరు ఏరియాలో ఉంటాడని నమ్మబలికాడు.

ఇద్దరు కలిసి బైక్ పై కొత్తూరు పోతూ మధ్యలో ఆగి మద్యం కొనుగోలు చేశారు. అనంతరం కొత్తూరు ప్రాంతంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ ఈ ప్రాంతానికి వెళ్లి ఫుల్లుగా మద్యం సేవించారు. తర్వాత సూర్యనారాయణ ను సుధాకర్ వెనక నుండి పెద్దరాయితో తలపై మోదాడు. దీంతో సూర్యనారాయణ కిందపడిపోయాడు. అనంతరం అతని గుండెల పై చవక కర్రలతో విపరీతంగా దాడి చేశారు. చనిపోయాడు అని నిర్ధారించుకున్న తరువాత మృతుని ఒంటిపై పెట్రోల్ పోసి అత్యంత కిరాతకంగా తగలబెట్టారు. తమదైన శైలిలో కేసును విచారించి త్వరితగతిన ఛేదించినందుకు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,సీఐ సుబ్బారావు, ఎస్సైలు లక్ష్మణరావ,పుల్లారెడ్డి, సిబ్బందికి ఎస్పీ భాస్కర్ భూషణ్ రివార్డులను ప్రకటించారు.

Related posts

కరోనా వ్యాక్సిన్: ప్రయోగ దశలు దాటడం అంత సులభమా?

Satyam NEWS

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై అపోహ‌లతోనే రైతులు త‌ప్పుదోవ‌

Sub Editor

గౌడ్ కుల సంఘం ఆధ్వర్యంలో యరగాని నాగన్న గౌడ్ కు ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment