34.2 C
Hyderabad
April 23, 2024 12: 51 PM
Slider మహబూబ్ నగర్

నాగిరెడ్డి చెరువు నీటిని అక్రమంగా వాడుతున్న క్రషర్ యజమానులు

#Nagireddy Tank

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నగర పంచాయతీ పరిధిలోని చౌటబెట్ల శివారులోని నాగిరెడ్డి చెరువు నీళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తమ వ్యాపార అవసరాల కోసం క్రషర్ యజమానులు వాడుకుంటున్నారు.

చెరువు నీళ్లను అక్రమంగా వాడుకుంటున్న క్రషర్ యజమానులపై చౌటబెట్ల 15 వ వార్డు యువకులు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.

అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని వంగ రాజశేఖర్ గౌడ్ అన్నారు.

గత సంవత్సరం మున్సిపల్ ఎన్నికల ముందు ప్రస్తుత కౌన్సిలర్ నాగిరెడ్డి చెరువులోని అక్రమంగా వినియోగిస్తున్న బోరు మోటర్ ను అధికారులచే దగ్గర ఉండి సీజ్ చేయించారు.

మరి ఎవరి అండ దండలతో బోరు మోటర్ రీఓపెనింగ్ చేసి నడిపిస్తున్నారో అర్ధం కావడం లేదని రాజశేఖర్ గౌడ్ అన్నారు.

ఈ సమస్య గురించి కౌన్సిలర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదని ఆయన అన్నారు.

అలాగే ఇదే నాగిరెడ్డి చెరువులో పందుల పెంపకంను గతంలో ఆపిన ప్రజాప్రతినిధి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల ముందు వార్డు లోని ప్రజలకు అన్ని నేనే చేశాను అని వార్డు ప్రజలను భ్రమలో ఉంచి, ఎన్నికల్లో గెలిచి కేవలం స్వలాభం కోసం పని చేస్తున్నారని ఆయన అన్నారు.

గ్రామ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన స్థానిక కౌన్సిలర్ ఇప్పటికైనా స్పందించాలని చౌటబెట్ల వార్డు ప్రజలు కోరుతున్నారు.

Related posts

ఆశ్చర్యం: ఉక్రెయిన్ లో పర్యటించిన అమెరికా ప్రధమ మహిళ

Satyam NEWS

భ్రూణ హత్యలు రూపుమాపాలి

Satyam NEWS

ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న‌, దిశ యాప్ పై అవ‌గాహ‌న‌, త్రిబుల్ డ్రైవింగ్ ల‌పై ఝ‌ల‌క్

Satyam NEWS

Leave a Comment