28.7 C
Hyderabad
April 17, 2024 04: 02 AM
Slider ప్రత్యేకం

నిమ్మగడ్డ ఆదేశాలను ఉల్లంఘించేందుకే సీఎస్ నిర్ణయం

#AditynathDas

ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది.

ఎన్నికల కమిషనర్ ఆదేశించినట్లు అధికారులను తొలగించడం సాధ్యం కాదని ఆయన ప్రకటించారు. ఎస్ఈసీ తొలగించిన అధికారులు కరోనా విధుల్లో ఉన్నవారని అందువల్ల వారిని ఇప్పుడు విధుల నుంచి తప్పించడం సాధ్యం కాదని సీఎస్‌ వివరించారు.

ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీఎస్‌ తన లేఖలో కోరారు. ఎస్‌ఈసీ, ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పిందని సీఎస్‌ అన్నారు.

అందువల్ల ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు తాము సమ్మతించేది లేదని ఆయన అన్నారు. పోలింగ్‌, వ్యాక్సినేషన్‌ రెండూ ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎస్‌ఈసీని ఆయన కోరారు.

Related posts

కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

కామారెడ్డిలో 540 నామినేషన్ల దాఖలు

Satyam NEWS

సాలిడారిటీ: పోలీసులు ఎక్కడున్నా పోలీసులే

Satyam NEWS

Leave a Comment