32.2 C
Hyderabad
March 28, 2024 22: 54 PM
Slider ప్రపంచం

కరోనా చికిత్సలో మంచి ఫలితాలు ఇచ్చేది ఏదో తెలుసా?

#Curcumin

కరోనా సోకితే దానికి చికిత్స లేదు. కేవలం సైడ్ ఎఫెక్ట్ లను తగ్గించేందుకు వాడే మందులు తప్ప కరోనా చికిత్సకు మందు ఇంకా కనిపెట్టలేదు.

కొన్ని మందులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నా అవి కొందరిలోనే పని చేస్తున్నాయి. కొత్త కొత్త విధానాలు అనుసరిస్తున్నా సరైన ఫలితాలు రావడం లేదు.

దాంతో ఏం చేయాలి? అంటూ వైద్య శాస్త్ర నిపుణులు తలపట్టుకుని కూర్చున్నారు. ఈ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలికివస్తున్నాయి.

ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే మన కళ్ల ముందు ఉండేది, ప్రతి రోజూ మనం వాడేది అయిన పసుపు కరోనా చికిత్సలో అద్భుతంగా పని చేస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడి అయింది.

పసుపు నుంచి వచ్చే కర్క్యుమిన్ కరోనా రోగులకు చేసే చికిత్సలో అద్భుతంగా పని చేస్తుందట. సమి సబిన్సా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మొహమ్మద్ మజీద్ తన సహ శాస్త్రవేత్తలతో కలిసి కర్క్యుమిన్ పై పరిశోధనలు నిర్వహించారు.

కరోనా వైరస్ తనకు ఉండే కొమ్ములను ఉపయోగించి ఏసీఈ2 రిసెప్టార్ ద్వారా మానవ కణజాలంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఏసీఈ2 రిసెప్టార్ ద్వారా కరోనా వైరస్ ప్రవేశించడాన్ని కర్క్యుమిన్ పాక్షికంగా నిరోధిస్తున్నదని ప్రాధమిక పరిశోధనలో తేలినట్లు మజీద్ అంటున్నారు.

పసుపు దివ్య ఔషధం

ఉపిరితిత్తుల వాపు, ఫైబ్రోసిస్, ఎడిమా లాంటి రుగ్మతల్లో కర్క్యుమిన్ ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. మానవ శరీరాలలో వైరల్ ఇన్ ఫెక్షన్లలో తలెత్తే సైటోకైన్ ఉత్పాతాన్ని కర్క్యూమిన్ తగ్గిస్తుందని కూడా మరి కొన్ని పరిశోధనల్లో తేలింది.

అంతే కాకుండా వైరస్ ఇన్ ఫెక్షన్ లలో గుండె, మూత్ర పిండాల పనితీరును ప్రభావితం చేయకుండా కూడా కర్క్యూమిన్ నిలుపుదల చేస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

మార్బిడ్ ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్ డి ఎస్) (ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావం) లక్షణాలను కూడా కర్క్యూమిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని అంటున్నారు.

వృక్ష సంబంధిత కర్క్యూమిన్ ప్రస్తుత కరోనా మహమ్మారి చికిత్సలో ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మజీద్ అంటున్నారు.

Related posts

గురుగ్రామ్ లో సెక్స్ వర్కర్ పై నలుగురి అత్యాచారం

Satyam NEWS

ఆగస్టు 14 వరకు కోర్టులకు లాక్ డౌన్ పొడిగింపు

Satyam NEWS

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్ధులు వీరే?

Satyam NEWS

Leave a Comment