28.7 C
Hyderabad
April 20, 2024 04: 17 AM
Slider ముఖ్యంశాలు

గుడ్ డెసిషన్: కార్పొరేట్ కాలేజీలకు సీట్ల కటాఫ్

#Corporate College

కరోనా నేపథ్యంలో ప్రయివేటు కాలేజీల నిర్వహణపై ఏపి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. క్లాస్ రూమ్ లలో పరిమితి లేకుండా డిమాండ్ ఉన్నంత వరకూ విద్యార్ధులను చేర్చుకునే కార్పొరేట్ కాలేజీలకు ఈ నిబంధనలు మింగుడు పడే అవకాశం లేదు.

ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఒక్కో క్యాంపస్ లో 350 మంది విద్యార్ధులు మాత్రమే ఉండాలి. విద్యార్ధుల మధ్య భౌతిక దూరం ఉండేవిధంగా సీటింగ్ అరేంజిమెంట్లు కూడా ఏర్పాటు చేయాలి. కనిష్టంగా 4 సెక్షన్లు, గరిష్టంగా 9 సెక్షన్‌లకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఇప్పటి వరకూ లాభాలు ఆర్జించిన కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈ నిబంధన లాభాలను పూర్తిగా తగ్గించివేస్తుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాలు చిన్న విద్యా సంస్థలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.

Related posts

ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారను: ఎంపీ ఆదాల

Bhavani

29 నుండి తిరుమ‌ల‌లో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష

Satyam NEWS

నేటి నుండి మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణి

Satyam NEWS

Leave a Comment