దేశంలో డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు జాతీయ భద్రతకు సవాలు విసురుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. డీప్‌ఫేక్ కూడా సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు సవాల్ గా మారిందని ఆమెల న్నారు. ఈ సమావేశాలలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఈ సమావేశాలలోని ప్రధానాంశం. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ సమావేశాలలో 16 ముసాయిదా చట్టాలను కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఇందులో ఇమ్మిగ్రేషన్‌ను నియంత్రించే బిల్లు, 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి మరొకటి ఉంది. మహా కుంభ్ తొక్కిసలాట మరణాలు, వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి.
previous post
next post