32.2 C
Hyderabad
March 29, 2024 00: 12 AM
Slider జాతీయం

తమిళనాడులో సైబర్ క్రైం: ఆసుపత్రి డేటా చోరీ

#cybercrime

తమిళనాడులో భారీ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రముఖ వైద్యశాల అయిన శ్రీ సరన్ మెడికల్ సెంటర్‌లోని 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత డేటాను హాకర్లు చోరీ చేశారు. చోరీ చేసిన ఆ డేటాను 400 డాలర్లకు అమ్ముకున్నారు. సైబర్ నేరాలను పసిగట్టే క్లౌడ్‌సెక్ కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ డేటాను త్రీ క్యూబ్ ఐటీ ల్యాబ్ నుంచి తీసుకున్నట్లు చెబుతున్నారు.

శ్రీ సరన్ మెడికల్ సెంటర్‌లో త్రీ క్యూబ్ ఐటీ ల్యాబ్ నుంచి సాఫ్ట్ వేర్ కొనుగోలు చేస్తున్నదని చెబుతున్నారు. లీక్ అయిన డేటాలో పేషెంట్ల పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలు, సంరక్షకుడి పేరు మరియు డాక్టర్ సమాచారం ఉన్నాయి. క్లౌడ్‌సెక్ విశ్లేషకుడు నోయిడ్ వర్గీస్ మాట్లాడుతూ, ఈ సంఘటనను చైన్ హాకింగ్ అంటామని తెలిపారు. ఎందుకంటే, ముందుగా ఆసుపత్రికి చెందిన ఐడీ విక్రేతపై దాడి జరిగింది.

హ్యాకర్ తన సిస్టమ్‌లోకి వెళ్లి రోగుల వ్యక్తిగత మరియు ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని దొంగిలించాడు. ఈ ఘటనకు ఒక్కరోజు ముందు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పై సైబర్ దాడి జరగడం గమనార్హం. లక్షలాది మంది పేషెంట్ల పర్సనల్ డేటాకు హ్యాకర్ తూట్లు పొడిచాడు. పేషెంట్ల డేటాను విక్రయించే ధరను హ్యాకర్ 100 మెరికన్ డాలర్లుగా ఉంచినట్లు సమాచారం. అంటే, ఈ డేటా చాలా కాపీలు అమ్ముడయ్యాయి.

Related posts

ఎన్టీఆర్ పేరు తీసేయడాన్ని సమర్థించిన లక్ష్మీపార్వతి

Satyam NEWS

శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌

Satyam NEWS

కరీంనగర్ లో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవం

Satyam NEWS

Leave a Comment