36.2 C
Hyderabad
April 25, 2024 19: 42 PM
Slider రంగారెడ్డి

సినీ నటుల మార్ఫింగ్ ఫొటోలను ప్రచారం చేసేవ్యక్తి అరెస్టు

#cybercrime

నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా మార్ఫింగ్ చేసిన సినీనటుల ఫొటోలను తప్పుడు పద్ధతుల్లో పోస్టు చేస్తున్న ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పందిరి రామ వెంకట వీర్రాజు అనే 30 సంవత్సరాల ఈ వ్యక్తి కోన సీమ జిల్లా రాయవరం పసలపూడి గ్రామానికి చెందిన వాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా మహిళల పరువు తీసే మార్ఫింగ్ ఫొటోలను ప్రచారం చేయడం ఇతని అలవాటుగా పోలీసులు తెలిపారు.

నిందితుడు పరువు నష్టం కలిగించే, అసభ్య పదాలతో అసభ్యకరమైన మరియు ఇబ్బందికరమైన ఫోటోలను ఇతను పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తెలుగు సినిమా నటీమణుల గురించిన వివరణతో యూజర్ ఐడి:@sairavi267తో ఒక నకిలీ ట్విట్టర్ ఖాతాను సృష్టించాడు. ఇది ఆ ప్రసిద్ధ టాలీవుడ్ నటీమణులను చాలా దుర్భాషలాడుతూ, అగౌరవపరిచేలా పోస్టు చేసేవాడు.

నిందితుడు చాలా యాక్టివ్‌గా సోషల్ మీడియాలో తెలుగు సినిమా నటీమణులను ఫాలో అవుతూ వారి వీడియోలు మరియు చిత్రాలను సేకరించేవాడు. ఆ తర్వాత వాటిని మార్ఫింగ్ చేసేవాడని పోలీసులు తెలిపారు.  సైబర్ క్రైమ్స్ ఏసీపీ జి. శ్రీధర్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్ ఏడీసీపీ రితి రాజ్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.నరేష్ మరియు సిబ్బంది ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఏజెన్సీ ప్రాంత యువకులు అన్ని రంగాల్లో రాణించాలి

Murali Krishna

హామీ నిలబెట్టుకోలేని జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు

Satyam NEWS

ఫస్ట్ నుంచి పంతుళ్ల కు పరేషాన్ మొదలు

Satyam NEWS

Leave a Comment