36.2 C
Hyderabad
April 25, 2024 19: 02 PM
Slider ముఖ్యంశాలు

సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా సైబర్ క్రైం యూనిట్స్

#Nalgonda Police

పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్ వారియర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి చెప్పారు.

సోమవారం పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోయిందని చెప్పారు.

సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం లక్ష్యంగా సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. తద్వారా స్ధానికంగానే సైబర్ కేసులను  పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక శిక్షణ, అవగాహన  కార్యక్రమాన్ని ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

పెరిగిపోతున్న సాంకేతికతకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ యూనిట్ల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నదని తెలిపారు. ఇందుకోసమే పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి సిబ్బందికి శిక్షణ ఇస్తునట్లు తెలిపారు.

జిల్లాలలో జరిగే సైబర్‌ నేరాలను అక్కడికక్కడే నియంత్రించేందుకు ఈ విభాగాలు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. సైబర్ నేరాల కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి నేరస్ధులను గుర్తించటం, వారికి శిక్ష పడేలా చేయడం తద్వారా బాధితులకు న్యాయం చేయడాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొవాలని సూచించారు.

సైబర్‌ నేరాల నియంత్రణపై రోజుకు మూడు గంటల పాటు వారం రోజులు  ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించామని, సిబ్బందికి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. సైబర్‌ నేరం ఎలా జరుగుతుందనే విషయం దగ్గరి నుంచి దాన్ని సృష్టిస్తున్న వారి వరకు గుర్తించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

దీనిని సమర్ధవంతంగా అమలు చేయడం కోసం పోలీస్‌ శాఖలో సాంకేతికతపై పూర్తి స్థాయిలో పట్టు కలిగిన సిబ్బందిని  సైబర్‌ నేరాల నియంత్రణకు ఉపయోగించి ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించేలా శిక్షణ ఉంటుందని తెలిపారు.

శిక్షణలో కంప్యూటర్ వైరస్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ ఛాలెంజెస్, రిస్క్‌ & మేనేజ్‌మెంట్, నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ పాలసీ యాక్ట్, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌ డేటా సెంటర్, నెట్‌ వర్కింగ్‌ వ్యవస్థ, నేషనల్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్, ఇన్ఫర్మేషన్‌ ఆడిటింగ్‌ కంప్లయింట్స్, ఐవోటీ, క్లిష్టమైన వెబ్‌ అప్లికేషన్ సెక్యూరిటీ రిస్క్స్, మొబైల్‌ అప్లికేషన్స్ సెక్యూరిటీ, సోషల్‌ మీడియా ఇన్‌ ఈ గవర్నెన్స్, ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ తదితర అంశాలపై  వారం పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ పోలీస్ శాఖ అమలు పరుస్తున్న అన్ని రకాల ఫంక్షనల్ వర్టీకల్స్ సమర్ధవంతంగా పని చేసే విధంగా నిరంతర పర్యవేక్షణ జరగాలన్నారు. సమావేశంలో జిల్లాల వారీగా నేర సమీక్ష, వర్టీకల్స్ పనితీరు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులలో శిక్షల శాతంతో సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

అన్ని స్థాయిలలో సాంకేతిక వినియోగం : రంగనాధ్

నల్లగొండ జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిలలో వినియోగిస్తున్నామని రాబోయే రోజులలో సైబర్ నేరాల నియంత్రణలోనూ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా సిబ్బందిని కేటాయించి శిక్షణ సద్వినియోగం చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో ముందువరుసలో నిలిచే విధంగా కృషి చేస్తామని చెప్పారు.

వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ నర్మద, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, ఐటి సెల్ సిఐ రౌతు గోపి, డిసిఆర్బీ రవీందర్,  రోడ్ సేఫ్టీ స్పెషల్ ఆఫీసర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల మాడవీధుల్లో కోలాహలంగా కోలాటం

Satyam NEWS

ఎంఎల్సీ ఎన్నికలకు జేడ్పీ హెచ్ సీ పోలింగ్ కేంద్రంపై పోలీసు బాస్ దృష్టి

Satyam NEWS

పేదల పట్ల అంకితభావంతో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment