30.2 C
Hyderabad
February 9, 2025 19: 47 PM
Slider ముఖ్యంశాలు

సైబర్ మోసంలో ముగ్గురు అరెస్టు

#cybercrime

దురాశతో ఆన్లైన్ పద్ధతిలో ధని లోన్ ఆప్ ద్వారా అమాయకులను నిలువు దోపిడీకి గురిచేసిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశామని వనపర్తి సైబర్ క్రైం  డిఎస్పీ ఎన్.బి.రత్నం,  వనపర్తి సీఐ క్రిష్ణ తెలిపారు. లోన్ మంజూరి అయ్యిందని లేదా లోన్ కావాలంటే ఇస్తామని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో అమాయకుల నుండి 4 కోట్ల మేర వసూలు చేసి మోసగించారన్నారు.

సదరు, ముద్ర & ధని లోన్ అప్ ల ద్వారా మోసపోయిన సైబర్ ఫిర్యాదులు రాష్ట్ర స్థాయిలో పెద్ద మొత్తంలో నమోదు కాగా ఈ ఫిర్యాదుల విచారణలో భాగంగా గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు విచారణను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్, డీజీపీ  ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్  అధ్వర్యంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ రత్నం, ఎస్సై రవి ప్రకాష్, వనపర్తి సీఐ కృష్ణయ్య, గోపాలపేట ఎస్సై,నరేష్, జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది  జిల్లా పోలీసు సిబ్బంది ఉమ్మడిగా దర్యాప్తు చేసి తేదీ 20-1-2025 నాడు 55 మంది సైబర్ నేరస్తులను గుర్తించి, తేదీ. 20.01.2025 నాడు (03) ముగ్గురిని ఆరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అదేవిధంగా వారి వద్ద నుంచి దాదాపు 30 లక్షల రూపాయల విలువ గల ఒక బ్రేజ్జా కారు, జేసీబీ  (04) సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు  ముదావత్ నరేష్ నాయక్,  సూర్తి తుండ, మూసాపేట్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా,  ముదావత్ వెంకటేష్ నాయక్ తండ్రి కండ్యా నాయక్, ఆటో డ్రైవర్, ముదావత్ చందు నాయక్ తండ్రి భావు నాయక్, అరెస్ట్ చేసి విచారించగా, వారు ఇప్పటివరకు కోలకతా, ఢిల్లీ, పాట్నాలలో ఉంటూ అంకిత్, పంకజ్, వారి సహచరులు చెప్పినట్లుగా సైబర్ నేరాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదించరని చెప్పారు. మిగితా నిందితుల కోసం వనపర్తి ఎస్పీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారని,  నిందితులను త్వరలోనే పట్టుకుంటామని  తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఘనంగా సోనియా గాంధీ 74 వ జన్మదినోత్సవం

Satyam NEWS

పైడిత‌ల్లి పండుగ: సిరిమాను తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమారాలు ఏర్పాటు…!

Satyam NEWS

బెంగుళూరులో విపక్ష కూటమి నమావేశం రేపు

Satyam NEWS

Leave a Comment