36.2 C
Hyderabad
April 25, 2024 21: 56 PM
Slider రంగారెడ్డి

స్క్రాచ్ కార్డు పేరుతో జేబులు గీకేస్తున్నారు… జాగ్రత్త

#CybarabadPolice

ఈ కామర్స్ కంపెనీ పేరుతో, న్యాప్టాల్ పేరుతో స్క్రాచ్ కార్డ్ పై గిఫ్టులు వచ్చాయంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కమిషనర్ సిపి సజ్జనార్ కమిషనర్ రేట్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. గత ఆరు నెలలుగా కమాస్ కంపెనీ న్యాప్టాల్ పై స్క్రాచ్ కార్డ్ పై గిఫ్టులు వచ్చాయి అంటూ కొందరికి ఫోన్ చేసేవారు.

కారు వచ్చిందని, కాదు తీసుకోకపోతే 14 లక్షలు ఇస్తామని నమ్మబలికేవారు. వీటిపై కొన్ని రకాలుగా ఛార్జీల రూపంలో ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసేవారు.

ఇలా మోసాలకు పాల్పడుతున్న 10 మందిని సైబరాబాద్ పోలీస్ అరెస్ట్ చేశారు  వీరిలో 5 గురిని మంచిర్యాలకు చెందిన వారుగా గుర్తించారు.

ప్రధాన నిందితులు జార్ఖండ్ కి చెందిన వారు కాగా  మరికొందరు మధ్యప్రదేశ్ కు చెందినవారు. వీరు 2 కోట్లకు పైగా మోసం చేసినట్లుగా అంచనా గా ఉంటుందని కమిషనర్ సిపి విసి సజ్జనార్ తెలిపారు.

5 గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని తెలియపరచారు.

వారివద్దనుండి 42 సెల్ ఫోన్ లు 2 ల్యాప్ టాప్, లు  2 రౌండ్ సీల్ స్టాంప్ , డెబిట్ కార్డ్ లు 28, ఆధార్ కార్డ్ లు 10, స్క్రాచ్ కార్డులు 2500 కవర్లు సీజ్ చేశామని వివరాలు వెల్లడించారు.

ఈ కేసును ఛేదించిన పోలీస్ వారిని అభినందించి వారికి తగిన రివార్డు అందించారు

Related posts

యోగా ద్వారానే మాన‌సిక‌, శారీర‌క ప్ర‌శాంత‌త‌

Sub Editor

మల్దకల్ బ్రహ్మోత్సవాలలో రేపు ధ్వజారోహణం

Bhavani

ఒంటిమిట్టలో గరుడ వాహనంపై శ్రీ కోదండ రామ స్వామి

Satyam NEWS

Leave a Comment