19.7 C
Hyderabad
December 2, 2023 05: 29 AM
Slider ముఖ్యంశాలు

కుప్పం నుండి సైకిల్ పై రాజమండ్రికి

#TDP

చంద్రబాబుకు సంఘీభావంగా ఓ యువకుడు కుప్పం నుండి సైకిల్ పై బయలు దేరి రాజమండ్రికి చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, కనమపచ్చర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గణపతి అనే యువకుడు ఈ నెల 12న సైకిల్ పై బయలుదేరి రాజమండ్రికి చేరుకున్నాడు. బెంగళూరులోని సోలార్ ఇన్వర్టర్ కంపెనీలో క్వాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్న గణపతి చంద్రబాబుకు వీరాభిమాని.

ఈ నెల 9న చంద్రబాబు అరెస్టు అయ్యి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారన్న విషయం తెలుసుకున్న గణపతి సంఘీభావం తెలిపేందుకు 724 కి.మీ మేర సైకిల్ తొక్కి రాజమండ్రికి చేరుకన్నాడు. చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రిలోనే బస చేస్తున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను కలిశాడు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇంతటి అభిమానులు ఉండటం మనోధైర్యం ఇస్తోందని, మీ అభిమానం, అండదండలతోనే చంద్రబాబు బయటకు వస్తారని తెలిపారు. కుప్పం ప్రజలు తమపై చూపిస్తున్న ఆప్యాయతను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.

Related posts

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కేసీఆర్ సర్కార్ పై చర్యలు

Satyam NEWS

శ్రీ మూలస్థానమ్మ నవరాత్రి ఉత్సవాల్లో పులివర్తి నాని దంపతులు

Satyam NEWS

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!