35.2 C
Hyderabad
April 20, 2024 18: 05 PM
Slider శ్రీకాకుళం

డాడీ హెల్పింగ్ ఫౌండేషన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఉదారత్వం

#Prabhas Fans

శ్రీకాకుళం రూరల్ మండలం  పెద్దపాడు గ్రామంలో గల పొందర వీధికి చెందిన గంగాధర హారిక ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్నది. వైద్యానికి లక్షలు అవసరమని డాక్టర్లు తెలపడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ స్థాపించిన  డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ వారు ట్రెట్మెంట్ ఖర్చులకు రూ.6000 అందించారు.

ఈ పాప తల్లిదండ్రులు రోజువారి కూలీలు, ఈమె పెద్దపాడు ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. ఈమె పరిస్థితి బట్టి సహాయం అందించే  దాతలు ముందుకు రావాలని ప్రభాస్ సూర్య  కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపాడు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గుండా బాల మోహన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అంద చేయవలసిందిగా  కోరుతున్నారు.

సహాయం చేయవలసిన  సెల్ నెంబరు 7093992533, ఫోన్ పే నెంబర్ 9182018180 గోవిందరావు, బ్యాంక్ ఎకౌంటు నెంబరు 73153213321, ఐ.ఎఫ్.ఎస్సి. కోడ్. నెంబరు ఏ.పీ.జీ.వీ.బీ 0001182, పెద్దపాడు  బ్రాంచ్, శ్రీకాకుళం రూరల్ మండలం.

Related posts

క్రాలింగ్: కేసీఆర్ సారంటే దేవునితో సమానం

Satyam NEWS

బాబా జీవితమే సమస్త మానవాళికి సందేశం

Bhavani

అక్రమ కేసులకు భయపడేది లేదు: మండిపల్లి

Satyam NEWS

Leave a Comment