ఎన్ టి రామారావు పెద్ద అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటు వెంకటేశ్వరావు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు హితేష్ టిక్కెట్ కోసం ప్రయత్నించగా పౌరసత్వం సమస్యల వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయారు. దాంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీ చేసి ఓడిపోయారు. ఈ కార్యక్రమం అంతా జరుగుతున్న రోజుల నుంచి దగ్గుబాటు వెంకటేశ్వరరావు భార్య దగ్గుబాటు పురందేశ్వరి బిజెపిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి గా పని చేసిన పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే బిజెపిలో చేరారు. బిజెపిలో ఆమె ఎంపికా పోటీ చేసినా గెలవలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పురందేశ్వరి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే అది వీలు కాలేదు. దగ్గుబాటి వెంకటేశ్వరావు గతంలో బిజెపిలో పని చేసి నందున ఆయన మళ్లీ ఆ పార్టీ లోకి వెళ్లలేకపోయారు. దాంతో భార్య భర్తలు ఇద్దరూ రెండు పార్టీలలో మిగిలి పోవాల్సి వచ్చింది. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో ఆమె వై ఎస్ ఆర్ పార్టీలో చేరాలా? ఆయన బిజెపిలో చేరాలా? అనే సంశయంలో కొద్ది కాలం గడిచింది. పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి పై ఫిర్యాదులు వస్తుడటంతో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. చివరకు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీమానా చేశారు.
previous post
next post