38.2 C
Hyderabad
April 25, 2024 12: 20 PM
Slider తూర్పుగోదావరి

అడ్డా కూలీలను వదలని కరోనా కష్టాలు

#daily wage workers

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో దీని ప్రభావం అన్ని రంగాల మీద పడుతున్నది. పది రోజుల నుంచి అడ్డా కూలీలకు, వీధి వ్యాపారులకు, ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి.

ముఖ్యంగా అడ్డాకూలీలకు పనులు దొరక డం లేదు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి కూలీ కోసం వచ్చిన ఎండ లోనే పనికోసం పడిగాపులు కాస్తున్నారు. ఇదే సమయంలో ఉదయం రోడ్లపై టిఫిన్‌ సెంటర్లు, మధ్యాహ్న భోజనాలు అమ్ముకునే స్ట్రీట్ వెండర్స్‌, వీధి వ్యాపారులు గిరాకి లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా పోయిందని మళ్లీ మాములు స్థితికి వస్తామని అనుకుంటే సెకండ్‌వేవ్‌ తో పరిస్థితులు అతలాకుతలమయ్యాయని, ఇలాగే ఉంటే కష్టం చేసుకొ ని బతికే పరిస్థితి ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ అమలు కావడం, కేసులు పెరిగితే కుటుంబాన్ని ఎలా పోషించు కోవాలని ఆవేదన చెందుతున్నారు.

లాక్‌డౌన్‌ భయం..

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు రోజురోజుకూ పెరిగిపో తున్నాయి. మరణాల సంఖ్యకూడా పెరుగుతుంది. కాగా, కేసులు పెరుగుతున్నా, మరణాలు సంభవిస్తున్న వివరాలు మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. దీంతో పరిస్థితులు మరింత తీవ్రమై లాక్‌డౌన్‌ పెడతారని జనం, కూలీలు, వ్యాపారస్థులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆటోలలో ప్యాసింజర్లు ఎక్కడం లేదని, రోజుకు రూ.200 కూడా వస్తలేవ ని వాపోతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌లో ప్రైవేట్‌ రంగంలో కొన్ని లక్షల మంది ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. ఇప్పుడు వారి పరిస్థితి మళ్లీ బిక్కుబిక్కుమనేలా ఉంది.

ఇప్పటికే కొన్ని ఆఫీస్‌లు వర్క్‌ ఫ్రం హోం ఇ వ్వగా కొందరికి, ఒకనెల సెలవు పెట్టాలని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నా యి. ఏడాది కాలంలో నిత్యావసరాల రేట్లు కూడా పెరిగాయని ఒక్క రో జు పని చేయకపోయినా ఇళ్లు వెల్లదీసే పరిస్థితి లేదంటున్నారు. కరోనా కట్టడికి కఠినమైన రూల్స్‌ అమలు చేయాలని, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related posts

జూలై 12 న తెలంగాణకు ప్రధాని..!

Bhavani

29న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

Sub Editor

జనతా గ్యారేజ్: ట్రంప్ విధ్వంసానికి రిపేర్లు మొదలు

Satyam NEWS

Leave a Comment