30.7 C
Hyderabad
April 19, 2024 08: 37 AM
Slider నల్గొండ

నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీల రోజువారి వేతనాలు పెంచాలి

#Roshapati

భారతదేశంలో కరోనా సంక్షోభ కాలంలో కోట్లాది సంపద బడా పెట్టుబడిదారు లైన అంబానీ, ఆదానితో పాటు ఇంకా కొంత మందికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని, కోట్లాది మంది ప్రజలకు ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడి పోయిందని, ఇది నేటి భారతంలో పచ్చి నిజమని, అంబానీ ఆదానిల కోసమే భారతదేశ రైతులు బలి తీస్తుంది ఎంతవరకు కరెక్ట్ అని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు  శీతల రోషపతి ప్రశ్నించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులు ఈగ కోటేశ్వరావు సింగర్ కొండ శ్రీను కు అగ్రిమెంట్ నోటీస్ ఇచ్చిన అనంతరం రోషపతి మాట్లాడుతూ ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీల రోజువారి వేతనాలు పెంచాలని కోరారు.

ఈనెల 31 నాటికి రెండు సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తవుతుందని, తిరిగి  అగ్రిమెంట్ చేయాలని కోరినారు. భారతదేశంలో దేశ భక్తి ఉద్యమం జరుగుతుంటే ప్రతి పార్టీ, ప్రతి ఒక్కరు రైతులకు మద్దతు పలకాలని, టిఆర్ఎస్ ప్రభుత్వం నవంబరు 26న జీన్స్ వ్యాప్త బందులో ఉత్సాహంగా పాల్గొన్న కేసీఆర్ ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత రైతుల ఉద్యమం గురించి మాట్లాడక పోవడం కారణాన్ని రాజకీయ విశ్లేషకులు, మేధావులు తెలపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్  అసోసియేషన్ గౌరవ సలహాదారులు గజ్జి ప్రభాకర్, కుక్కడపు కోటేశ్వరరావు, రైస్ మిల్ దినకూలీల యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు సామల కోటమ్మ, గోపమ్మ, సుజాత, శారద, కోటేశ్వరి, వెంకటమ్మ, మున్ని, మంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓటుకు ఆధార్ లింక్ చేయడం స్వాగతిస్తున్నాము

Satyam NEWS

వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి వారి రథోత్సవం

Satyam NEWS

వాయిద్య కళాకారుల సంఘం ములుగు మండల కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

Leave a Comment