26.2 C
Hyderabad
February 13, 2025 21: 51 PM
Slider సినిమా

హీరో రుషి కిరణ్ కు డాకూ మహరాజ్ అభినందన

#nandamuribalakrishna

“ది సస్పెక్ట్” చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్న ప్రవాస తెలుగుతేజం “రుషి కిరణ్”… “డాకు మహారాజ్”తో ఈ సంక్రాంతిని కబ్జా చేసేందుకు వచ్చిన బాలయ్య ప్రశంసలు దండిగా అందుకున్నారు. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన “డాకు మహారాజ్” ప్రి రిలీజ్ ఈవెంట్ లో “అఖండ” గెటప్ తో సందడి చేసిన బాలయ్య వీరాభిమాని రుషి కిరణ్… ఆ గెటప్పులో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించడంతోపాటు… బాలయ్య మెప్పు సైతం పొందారు. డల్లాస్ మరియు పరిసర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు 7 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న “డాకు మహారాజ్” బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని రుషి కిరణ్ ఆకాంక్షించారు. రుషి కిరణ్ నటించిన “ది సస్పెక్ట్” చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

రాజధాని పై ప్రధాని నోరు విప్పాలి

mamatha

మూడు రాజధానుల చట్టంపై స్టేటస్కో

Satyam NEWS

మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు

mamatha

Leave a Comment