39.2 C
Hyderabad
March 28, 2024 15: 48 PM
Slider రంగారెడ్డి

దళిత బంధు  దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది

#kavita

దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు  దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ హెచ్ఎంటి కాలనీ కి చెందిన వేముల మారయ్య, వేముల జితేందర్ లు దళిత బంధు నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఏబీ గ్రాఫిక్స్, ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దళితులు ఆత్మగౌరవంతో జీవిస్తూ ఆర్ధికాభివృద్ధి చెందాలని ఆకాంక్షతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దళిత బంధు

లబ్ధిదారులు నచ్చిన వ్యాపారం చేసుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన బిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో శుభవార్త వినిపించారన్నారు. దళిత బంధు మాదిరిగానే గిరిజన బందును అమలు చేసి తీరుతామని ప్రకటించారన్నారు.గిరిజనుల అభ్యున్నతే తమ లక్ష్యమని  సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారన్నారు. ఈ కార్య క్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు శాంతి సాయి జన శేఖర్, బొంతు శ్రీదేవి, పన్నాల దేవేందర్ రెడ్డి, బన్నాల గీతా ప్రవీణ్, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, గంధం జోష్నా నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి, గంధం నాగేశ్వరరావు, సాయి జన్ శేకర్, మేకల హనుమంతు రెడ్డి, బన్నాల ప్రవీణ్ కుమార్, కట్టా బుచ్చన్న, సుగుణాకర్ రావు, మాస శేఖర్, బాల్ రెడ్డి, కనక రాజు గౌడ్, నేమూరి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

అతిక్రమణలపై @CEC_EVDM ట్విట్ట‌ర్‌లో ఫిర్యాదు చేయండి

Satyam NEWS

సండే స‌ర‌దాగా.. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్

Sub Editor

వి ఎస్ యూనివర్సిటీలో రెండవ అంతర్ కళాశాల యువ మహోత్సవాలు

Bhavani

Leave a Comment