26.7 C
Hyderabad
May 1, 2025 04: 37 AM
Slider నిజామాబాద్

దళిత బందు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలి

#kamareddy

దళిత బంధు ఒక్క హుజరాబాద్ లోనే కాదు రాష్ట్ర మొత్తం అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. వెంకట్ రాములు డిమాండ్ చేశారు.

అందులో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముందుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు జుక్కల్ మండల కేంద్రంలో సిపిఎం జెండా ను కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎస్. వెంకట్ గౌడ్ ఆవిష్కరించారు.

జుక్కల్ నియోజకవర్గం SC రిజర్వేషన్ చెందినది కాబట్టి ముందుగా దళితలందరికి దళిత బందు అమలు చేయాలని వెంకట్ రాములు కోరారు. పోడు భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని, అప్పటి వరకు రెవిన్యూ, అటవీ శాఖ అధికారుల ఒత్తిడి నుండి రైతులకు విముక్తి కల్పించాలని ఆయన కోరారు.

అర్హులైన పేద కుటుంబలకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో జుక్కల్ జోన్ కార్యదర్శి సురేష్ గొండ జిల్లా కమిటీ సభ్యులు అజయ్ కుమార్,బాలు, జుక్కల్ శాఖ సభ్యులు ఫిర్దోస్, అదేప్ప, నారాయణ,విట్టల్,మోతిరం, గోవింద్, తదితరులు పాల్గున్నారు.

Related posts

తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య

Murali Krishna

పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు

Satyam NEWS

జర్నలిస్టులకు త్వరలోనే కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!