23.7 C
Hyderabad
September 23, 2023 10: 39 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

గుండెలు పిండేసిన దళిత బాలిక ఆర్తనాదాలు

dalit-gangrape-encounter

ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం. ఒక దళిత బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ సంఘటన పూర్తిగా తెలుసుకుంటే ఇంత క్రూరమైన మాన మృగాలు ఉంటాయా అనే అనుమానం కలుగకమానదు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కౌసంబి మధ్య ఉన్నఘోసియా గ్రామంలో 15 సంవత్సరాల ఒక మైనర్ దళిత బాలికపై మూడు మానవ మృగాలు అత్యాచారం జరిపాయి. అత్యాచారం చేయడమే కాదు. ఆ ఘోరాన్ని వీడియో ఫిలిం తీశాయి.

ఆ వీడియో ఫిలిం ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు కూడా. ఆ దళిత బాలిక ఎంత ప్రాధేయపడినా ఆ మృగాలు వదల్లేదు. ఆ బాలిక అరుపులు, కేకలు గాల్లో కలిసిపోయాయి. అత్యాచారం చేశారు. ఆ బాలిక అరుపులు విన్న పక్క ఊరి వాళ్లు అనుమానంతో పరుగెత్తుకుని వచ్చారు. ఆ ముగ్గురిలో ఒకడైన నాజిక్ అనే వాడ్ని పట్టుకుని చితక్కొట్టారు. మిగిలిన ఇద్దరు పారిపోయారు. నాజిక్ అనే మృగాన్ని పోలీసులకు అప్పగించారు. మరునాడు బాలిక తండ్రి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. పోలీసులు అతడి ఫిర్యాదు తీసుకోకపోగా అతడిని దారుణంగా కొట్టి పంపించారు. దాంతో ఒక్క సారిగా గ్రామస్థులు పోలీస్ స్టేషన్ పై తిరుగుబాటు చేశారు.

దాంతో పోలీసులు దారికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఆదిల్ అనే ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వాడు కౌసంబి పరిసరాల్లోని ఒక గ్రామంలో దాక్కున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. వాడు తన వద్ద ఉన్న నాటు తుపాకితో పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు.

వాడ్ని కాళ్లపై కాల్చి గాయపరిచి అరెస్టు చేశారు. మూడో మానవ మృగం కోసం పోలీసులు గాలిస్తున్నారు. నేరాన్ని అదుపు చేయడమో నేరం జరిగిన తర్వాత వెంటనే కార్యరంగంలోకి దిగడమో చేయకుండా సారేఅక్లీ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది బాలిక తండ్రినే కొట్టడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. తుపాకితో ఇద్దరు పోలీసులను గాయపరిచేంత క్రూరమైన ఈ నేరస్తులను పోలీసులు మొదట్లో చూసీ చూడకుండా వదిలేయడం విమర్శలకు దారి తీసింది. బాలిక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ మానవ మృగాలకు ఉరివేయాలని కోరుతున్నారు ock

Related posts

ధాన్యం కొనుగోళ్ళు వేగంగా జరగాలి

Murali Krishna

చలి తీవ్రత కరోనాతో తస్మాత్ జాగ్రత్త!

Sub Editor

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!